Begin typing your search above and press return to search.

రాబిన్ హుడ్.. కంటెంట్ కూడా ఈ లెవెల్లో ఉండాలి నితిన్

మరల చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు రాబిన్ హుడ్ తో అలాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకు అందించాలని డిసైడ్ అయ్యారు.

By:  Tupaki Desk   |   30 March 2024 8:45 AM GMT
రాబిన్ హుడ్.. కంటెంట్ కూడా ఈ లెవెల్లో ఉండాలి నితిన్
X

ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. తన స్టైలిష్ పర్ఫామెన్స్ తో పాటుగా కావలసినంత వినోదాన్ని నితిన్ తన సినిమాల ద్వారా అందిస్తూ ఉంటాడు. అందుకే హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లో నితిన్ కి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నితిన్ ని అభిమానిస్తూ ఉంటారు.

అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈసారి అతను తప్పనిసరి ఒక హిట్ కొట్టాల్సిబ అవసరం ఉంది. ఇదిలా ఉంటే నితిన్ బర్త్ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ లో వెంకీ కుడుముల దర్శకత్వంలో నిర్మిస్తున్న రాబిన్ హుడ్ మూవీ పోస్టర్ ను డిలీట్ చేశారు. యూనిఫాంలో ఏజెంట్ రాబిన్ ఫుడ్ అని షర్ట్ పైన ఉండగ ఇయర్ బర్డ్స్ లో ఎవరితోనో మాట్లాడుకుంటూ స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న లుక్ రిలీజ్ చేశారు.

ఈ లుక్ లో నితిన్ బాగానే హైలెట్ అయ్యాడు. మేకర్స్ నితిన్ కి ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో నితిన్ భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరల చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు రాబిన్ హుడ్ తో అలాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకు అందించాలని డిసైడ్ అయ్యారు.

ఈ చిత్రంలో నితిన్ దొంగగా కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే అతనికి సూపర్ పవర్స్ కూడా ఉంటాయని ఆ మధ్య ఒక టాక్ వచ్చింది. ఇక పోస్టర్ ఉన్నంత స్టైలిష్ గా మంచి కంటెంట్ సినిమాలో కూడా ఉండాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే నితిన్ గత మూడు సినిమాలు మరీ దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఉన్నవాడి నుంచి దోచుకొని లేని వాడికి సహాయం చేసే సూపర్ హీరో క్యారెక్టర్ తరహాలో రాబిన్ హుడ్ కనిపిస్తాడని సమాచారం.

ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. రాబిన్ ఫుడ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా త్వరలో రిలీజ్ డేట్ పై స్పష్టత ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

అలాగే సెట్ లో ప్రత్యేకంగా నితిన్ బర్త్ డే వేడుకలు కూడా నిర్వహించారు. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాననే కాన్ఫిడెన్స్ తో నితిన్ ఉన్నారు. మరి భీష్మ లాంటి సక్సెస్ ఇచ్చిన వెంకీ మరోసారి ఎనర్జిటిక్ హీరోకి అదే స్థాయిలో హిట్ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీలీల ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా నటిస్తోంది. నితిన్ మంచి డాన్సర్ కావడంతో శ్రీలీలతో కచ్చితంగా అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.