Begin typing your search above and press return to search.

నితిన్ కూడా పాలిటిక్స్ స్టార్ట్ చేసేశాడు

రచయిత-దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో రానున్న "ఎక్స్‌ట్రా" చిత్రం రాకను ప్రకటిస్తూ, నితిన్ ఆసక్తికరమైన విషయాన్ని ట్వీట్ చేశాడు. "మన జెండా.. ఎజెండా... ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్" అని నితిన్ వివరణ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 6:56 AM GMT
నితిన్ కూడా పాలిటిక్స్ స్టార్ట్ చేసేశాడు
X

సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో అవ్వాలి లేదా కొత్త ట్రెండ్ సెట్ చెయ్యాలి అనే ఫార్ములా ఎప్పటికి వాడుకలో ఉండేవే. ఇక ఎవరు ఎంత కొత్తగా ట్రై చేశారు అన్న దాని బట్టి క్రేజ్ ఉంటుంది. సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు అందరూ కూడా లేటెస్ట్ పొలిటికల్ ట్రెండును వాడుతున్నారు. ఇక ఆ లిస్టులో యువ హీరో నితిన్ కూడా చేరిపోయాడు.


నితిన్ నుంచి నెక్స్ట్ ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ అనే అనే సినిమా రాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ పెంచడానికి తనదైన శైలిలో ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇటీవల నాని హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే హడావుడి చేశాడు. కొన్ని వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా కేసీఆర్ రాహుల్ స్టైల్ లో చేసిన ప్రెస్ మీట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ గా పొలిటికల్ వాతావరణం వేడుక్కుతున్న తరుణంలో ఈ విధంగా ప్రమోషన్స్ చేయడం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక నితిన్ కూడా ఇప్పుడు ఎక్స్ ట్రా సినిమా కోసం ఆ పొలిటికల్ టచ్ ఇస్తున్నాడు.

రచయిత-దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో రానున్న "ఎక్స్‌ట్రా" చిత్రం రాకను ప్రకటిస్తూ, నితిన్ ఆసక్తికరమైన విషయాన్ని ట్వీట్ చేశాడు. "మన జెండా.. ఎజెండా... ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్" అని నితిన్ వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 27న మార్క్యూలో రాబోతోందని ప్రకటించారు. మరోవైపు నాని కూడా 100% హాయ్ నాన్న పార్టీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం పక్కా అని అంటున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు థియేట్రికల్ స్టేట్ లో ఎక్కువ మెజారిటీ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూడాలి.

ఇక నితిన్ ఎక్స్ ట్రా సినిమా అతని కెరీర్ కు చాలా ముఖ్యమైన సినిమా. వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఈ హీరో ఎలాగైనా ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. మరోవైపు దర్శకుడు వక్కంతం వంశీ రచయిత గా ఒకప్పుడు కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి సక్సెస్ చూశాడు. కానీ డైరెక్టర్ గా మాత్రం అతను చేసిన మొదటి సినిమా నా పేరు సూర్య అంచనాలు అందుకోలేక పోయింది. మరి ఎక్స్ ట్రా సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.