Begin typing your search above and press return to search.

నితిన్.. ఇంకా ఎన్ని రోజులు ఇలా?

ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో రెడ్ కలర్ షర్ట్ వేసుకొని రైల్వే కూలిలా కనిపిస్తాడు. అదే లుక్ ని ఎలాంటి మార్పు లేకుండా ఈ పోస్టర్ ని నితిన్ దించేశాడు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 3:54 AM GMT
నితిన్.. ఇంకా ఎన్ని రోజులు ఇలా?
X

యంగ్ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కి డై హార్ట్ ఫ్యాన్ అనే సంగతి అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే తాను హీరో అవ్వాలనుకున్నట్లు గతంలో చాలా సందర్భాలలో చెప్పారు. అలాగే నితిన్ ని పవన్ కళ్యాణ్ కూడా సొంత తమ్ముడుగా భావించి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నితిన్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి పవన్ పై తన అభిమానాన్ని ఏదో ఒక రూపంలో తన సినిమాలో చూపిస్తూ ఉంటాడు.


పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తో సీన్స్, డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ తో కనీసం ఒక్క సారైనా కనిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఖుషి సినిమాలోని ఫేమస్ నడుము సన్నివేశాన్ని గుండెఝారి గల్లంతయ్యిందే సినిమాలో వాడేశాడు. అలాగే అతని డ్రెస్సింగ్ స్టైల్, సాంగ్స్ ని కూడా కొన్ని సినిమాలలో ఉపయోగించుకున్నాడు.

కొంతకాలం పవన్ కళ్యాణ్ అభిమానులు దీనిని ఆశ్వాదించారు. అయితే అది మరీ ఎక్కువ అయిపోతూ ఉండటం ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదనే మాట వినిపిస్తోంది. ఇంకెంత కాలం పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటావ్ అనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ చేస్తోన్న ఎక్స్ట్రార్డినరీ మూవీ టీజర్ అప్డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో రెడ్ కలర్ షర్ట్ వేసుకొని రైల్వే కూలిలా కనిపిస్తాడు. అదే లుక్ ని ఎలాంటి మార్పు లేకుండా ఈ పోస్టర్ ని నితిన్ దించేశాడు. ఈ లుక్ చూడటానికి బాగున్నా కూడా పవన్ కళ్యాణ్ అనుకరణ కాస్తా ఇబ్బందికరంగా ఉందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. లుంగీ, బాడీ లాంగ్వేజ్ కూడా పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తరహాలోనే ఉండటం విశేషం.

ఇక ఈ మూవీ టీజర్ 30న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు. హరీష్ జయరాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రేష్ట మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ఉండటం విశేషం.