Begin typing your search above and press return to search.

నితిన్ సినిమాలో మరో స్టార్..?

ఆ పాత్ర కోసం యంగ్ హీరోల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఒకరిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 3:05 PM GMT
నితిన్ సినిమాలో మరో స్టార్..?
X

లవర్ బోయ్ నితిన్ కెరీర్ లో హిట్లు ఫ్లాపులు చాలా కామన్. ఒకటి రెండు హిట్లు పడ్డాయి అంటే వరుసగా మూడు నాలుగు ఫ్లాపులు పడుతుంటాయి. దానికి కారణం ఏంటన్నది తెలియదు కానీ నితిన్ లాస్ట్ హిట్ భీష్మ మంచి జోష్ ఇచ్చినా సరే ఆ తర్వాత సినిమాలు మళ్లీ నిరాశపరిచాయి. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో నితిన్ క్యారెక్టరైజేషన్ లుక్స్ అన్నీ కొత్తగా ఉంటాయని తెలుస్తుంది.

వక్కంతం వంశీ రైటర్ గా స్టార్ సినిమాలు చేయగా డైరెక్టర్ గా అతను చేసిన తొలి ప్రయత్నమే రిజల్ట్ తేడా కొట్టడంతో డీలా పడ్డాడు. ఆ తర్వాత అతని డైరెక్షన్ లో సినిమా చేసేందుకు హీరోలు ఎవరు ఆసక్తి చూపించలేదు. ఎలాగోలా వక్కంతం వంశీ తో నితిన్ సినిమా ఫిక్స్ అయ్యింది. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టైటిల్ కి తగినట్టుగానే ఎక్స్ ట్రా ఆర్డినరీ స్టఫ్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ అంతా ఓ రేంజ్ లో ఉంది.

ఈ సినిమా చేస్తూనే భీష్మ కాంబోలో వెంకీ కుడుములతో నితిన్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. హీరో డైరెక్టర్ మాత్రమే కాదు ఈ సినిమాలో హీరోయిన్ కూడా రష్మికని రిపీట్ చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో రీజన్ తెలియదు కానీ ఆ సినిమా నుంచి రష్మిక బయటకు వచ్చేసింది. ఆమె ప్లేస్ లో శ్రీ లీలనే ఈ సినిమాకు కూడా తీసుకున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా చేస్తున్న శ్రీ లీల వెంకీ కుడుముల డైరెక్షన్ లో కూడా హీరోయిన్ గా చేస్తుంది.

సో నితిన్ తో రెండు వరుస సినిమాలతో అమ్మడు నటిస్తుంది. వెంకీ కుడుముల నితిన్ సినిమాలో మరో యువ హీరో నటిస్తాడని టాక్. సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఒక బలమైన పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం యంగ్ హీరోల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఒకరిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ హీరో పాత్ర నిడివి తక్కువే కానీ ఇంప్యాక్ట్ మాత్రం బాగా ఉంటుందని అంటున్నారు.

సో నితిన్ సినిమాలో మరో యువ హీరో నటించడం పక్కా అని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అతని పాత్ర ఎలా ఉంటుంది అన్నది త్వరలో తెలుస్తుంది. భీష్మ తర్వాత వెంకీ చిరుతో సినిమా ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు నితిన్ తో మరోసారి భీష్మ లాంటి హిట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు.