Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ డైరెక్టర్ ని పట్టేసిన నితిన్..!

సీనియర్ హీరోనే అయినా లవర్ బోయ్ ఇమేజ్ ని కొనసాగిస్తున్న నితిన్ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ కొనసాగిస్తుంటాడు.

By:  Tupaki Desk   |   23 March 2024 7:30 AM GMT
టాలెంటెడ్ డైరెక్టర్ ని పట్టేసిన నితిన్..!
X

సీనియర్ హీరోనే అయినా లవర్ బోయ్ ఇమేజ్ ని కొనసాగిస్తున్న నితిన్ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ కొనసాగిస్తుంటాడు. నితిన్ ని సరిగ్గా వాడుకుని ఎంటర్టైనైంగ్ సినిమాలు చేస్తే మంచి సక్సెస్ లు వస్తాయి. నితిన్ రీసెంట్ మూవీ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ అలాంటి ప్రయత్నమే చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. థియేటర్ లో సినిమా చూడని ఆడియన్స్ ఓటీటీలో సినిమా చూసి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం నితిన్ తనకు భీష్మ లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములతోనే సినిమా చేస్తున్నాడు.

రాబిన్ హుడ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా మరోసారి వెంకీ, నితిన్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తుందని హింట్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత నితిన్ వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను సిద్ధం చేస్తున్నాడు. అందులో ఒకటి వేణు శ్రీరాం డైరెక్షన్ లో సినిమా కాగా మరోటి నైంటీస్ వెబ్ సీరీస్ డైరెక్టర్ ఆదిత్యా హాసన్ తో మరోటి ప్లాన్ చేస్తున్నాడు. వేణు శ్రీరాం తో తమ్ముడు సినిమా చేస్తున్న నితిన్ ఆ సినిమా షూటిన్ కూడా సైలెంట్ గా చేస్తున్నాడు.

ఇక నైంటీస్ వెబ్ సీరీస్ తో సూపర్ అనిపించుకున్న ఆదిత్యా హాసన్ రీసెంట్ గా మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు తెలుగు వెర్షన్ డైలాగ్స్ తో కూడా అదరగొట్టాడు. ప్రేమలు తెలుగు వెర్షన్ హిట్ లో ఆదిత్యా హాసన్ డైలాగ్స్ కూడా మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారట.

నైంటీస్ వెబ్ సీరీస్, ప్రేమలు రెండు సినిమాల్లో ఆదిత్యా హాసన్ కామెడీ మీద ఎక్కువ పట్టు ఉన్నట్టు అర్ధమయ్యింది. నితిన్ కు తన బలం కూడా అదే కాబట్టి. ఆదిత్య హాసన్ నితిన్ కాంబో సినిమా ఆడియన్స్ కు ఒక మంచి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ అందిస్తారని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. ప్రస్తుతానికి వెంకీతో చేస్తున్న రాబిన్ హుడ్ సినిమా పూర్తి చేసే పనుల్లో ఉన్న నితిన్ ఆ మూవీ పూర్తి కాగానే ఆదిత్యా హాసన్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు.