Begin typing your search above and press return to search.

నితిన్ పెద్ద స‌వాలే చేసాడు!

ఔట్ పుట్ పై న‌మ్మ‌కంతో ఒక్కోసారి హీరోలు ఎంతో కాన్పిడెంట్ గా రిలీజ్ కి ముందు క‌నిపిస్తుంటారు. కానీ ఆ కాన్పిడెన్స్ ని మాట‌ల రూపంలో తొంద‌ర‌గా బ‌య‌ట‌కు తేవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 5:53 AM GMT
నితిన్ పెద్ద స‌వాలే చేసాడు!
X

ఔట్ పుట్ పై న‌మ్మ‌కంతో ఒక్కోసారి హీరోలు ఎంతో కాన్పిడెంట్ గా రిలీజ్ కి ముందు క‌నిపిస్తుంటారు. కానీ ఆ కాన్పిడెన్స్ ని మాట‌ల రూపంలో తొంద‌ర‌గా బ‌య‌ట‌కు తేవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఒక‌వేళ అలా బ‌ట‌య‌కు వ‌చ్చిందంటే? అంత‌కు మించిన కాన్పిడెన్స్ ఉంటే? త‌ప్ప స‌వాల్ విస‌ర‌డం లాంటివి చోటు చేసుకోవు. తాజాగా `ఎక్స్ ట్రా ఆర్డిన‌రీ` ఈవెంట్ లో నితిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. సినిమా విజ‌యంపై ఎంతో ధీమాగా స్పందించారు.

సినిమా చూసిన త‌ర్వాత‌ ప్రేక్ష‌కాభిమానులు కాల‌రెగ రేసుకుని థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని వ్యాఖ్యానించారు. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి వ్యాఖ్య‌లు నితిన్ త‌న ఏ సినిమా ఈవెంట్ లో చేయ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ యూత్ స్టార్ ఎన్నో సినిమాలు చేసాడు. కొన్ని చాలెంజింగ్ రోల్స్ సైతం చేసాడు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ వీరామాభిమాని ఇండ‌స్ట్రీ లోనూ బాగా ఫేమ‌స్ అయ్యాడు. అలాంటి స్టార్ తొలిసారి అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని స‌వాల్ విస‌ర‌డం ఆస‌క్తిక‌రం.

సాధార‌ణంగా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం అన్న‌ది చాలా రేర్. గ‌తంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ `మ‌హ‌ర్షి` స‌మ‌యలో రిలీజ్ త‌ర్వాత చేసారు. స‌క్స‌స్ మీట్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాన‌ని కాల‌రెగ‌రేసి మ‌రీ చెప్పాడు. విజ‌యం సాధించిన త‌ర్వాత మ‌హేష్ అలా వ్యాఖ్యానించ‌డంపై అభిమానులు అంతే గ‌ర్వంగా ఫీల య్యారు. కానీ నితిన్ రిలీజ్ కి ముందు అభిమానులు కాల‌రెగ‌రేసుకునేలా ఉంటుంద‌ని వ్యాఖ్యానిం చ‌డంతో అంత‌ను ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడో? అద్దం ప‌డుతుంది.

నితిన్ కి `భీష్మ` త‌ర్వాత స‌రైన హిట్ ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. చేసినా ఏ సినిమా విజ‌యం సాధించ‌లేదు. అలాగే `నా పేరు సూర్య` త‌ర్వాత రెండ‌వ ఛాన్స్ రావ‌డానికి వ‌క్కంతం వంశీకి చాలా స‌మ‌యం ప‌ట్టింది. నితిన్ ...వంశీని న‌మ్మి చేసిన చిత్రమిది. దీంతో ఇద్ద‌రికి ఈ సినిమా విజ‌యం అంతే కీల‌క‌మ‌ని నితిన్ వ్యాఖ్యానించాడు.