Begin typing your search above and press return to search.

రాబిన్ హుడ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు

ఈ గ్లింప్స్ లో విజువల్స్ లో కత్తులు పట్టుకొని ఉన్న గ్యాంగ్, స్టైల్ గా పోలీస్ యూనిఫాంలో వస్తోన్న నితిన్ ని చూడొచ్చు.

By:  Tupaki Desk   |   31 March 2024 4:46 AM GMT
రాబిన్ హుడ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు
X

యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తోన్న మూవీ రాబిన్ హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల నితిన్ కి జోడీగా నటిస్తోంది. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భీష్మ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా నితిన్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.

ఆ సినిమా తర్వాత మరల చెప్పుకోదగ్గ హిట్స్ నితిన్ ఖాతాలో పడలేదు. మళ్ళీ ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్న నితిన్ వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే నితిన్ బర్త్ డే సందర్భంగా రాబిన్ హుడ్ నుంచి స్పెషల్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

స్పెషల్ పోస్టర్ తో బర్త్ డే విషెస్ చెప్పిన యూనిట్ గ్లింప్స్ కూడా ప్రత్యేకంగా రిలీజ్ చేయడం విశేషం. ఈ గ్లింప్స్ లో విజువల్స్ లో కత్తులు పట్టుకొని ఉన్న గ్యాంగ్, స్టైల్ గా పోలీస్ యూనిఫాంలో వస్తోన్న నితిన్ ని చూడొచ్చు. ఆ బిల్డప్, ఎలివేషన్ చూస్తుంటే మూవీ ఎంటర్టైన్మెంట్ తో పాటు సాలిడ్ యాక్షన్ కూడా ఉంటుందని గ్లింప్స్ బట్టి స్పష్టం అవుతోంది.

గ్లింప్స్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. కచ్చితంగా నితిన్ కెరియర్ లో మంచి హిట్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సినిమాలో నితిన్ మునుపెన్నడూ లేని పాత్రలో కనిపించబోతున్నాడట. ఉన్నవాడి నుంచి దోచుకొని లేని వారికి సహాయం చేసే రాబిన్ హుడ్ గా నితిన్ కనిపిస్తాడని గతంలోనే టాక్ వచ్చింది. అతనికి కొన్ని శక్తులు కూడా ఉంటాయట.

మరి వెంకీ కుడుముల మ్యాజిక్ సినిమాలో ఎంతవరకు క్లిక్ అవుతుందో. ఈ సినిమాకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చుతున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. వీరిద్దరూ ఉన్నారంటే కచ్చితంగా వినోదం ఎక్కువగానే చిత్రంలో ఉంటుందని అంచనాకి వచ్చేయొచ్చు.

ఇక నితిన్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నితిన్, శ్రీలీల జోడీగా నటించడంతో మంచి డాన్స్ నెంబర్స్ కూడా ప్రేక్షకులు ఆశించవచ్చు. కచ్చితంగా నితిన్ కి మాత్రం ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి నితిన్ ఈసారి ఎలాంటి హిట్ అందుకుంటాడో.