Begin typing your search above and press return to search.

ఆయుధంతో లారీపై నితిన్.. అదిరింది 'తమ్ముడు'!

నేడు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   30 March 2024 5:14 AM GMT
ఆయుధంతో లారీపై నితిన్.. అదిరింది తమ్ముడు!
X

టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్.. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా మెప్పించలేకపోయారు. గతేడాది చివర్లో రిలీజైన ఈ సినిమా.. డిజాస్టర్ టాక్ అందుకుంది. దీంతో 2024లో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు నితిన్. సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న నితిన్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.


ఓవైపు భీష్మతో తనకు సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ మూవీ చేస్తుండగా.. మరోవైపు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఇంకో సినిమా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన శ్రీరామ్.. నితిన్ తో సినిమా చేస్తుండడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది ఆగస్టులో పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేకర్స్.. కొన్ని రోజుల క్రితం షూటింగ్ మొదలుపెట్టారు. వైజాగ్ లో ఇటీవల ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.

నేడు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ ను తమ్ముడు గా ఫిక్స్ చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ టైటిల్ నే అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఆశయం, ధైర్యం, సంకల్పం యొక్క కథ అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. నితిన్ కు స్పెషల్ విషెస్ కూడా తెలిపారు.

ఇక పోస్టర్ లో ఆడవాళ్లు డ్రైవ్ చేస్తుంటే లారీపై కుమారస్వామి ఆయుధంతో నితిన్ కూర్చుని సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆ లారీపై పగడాలమ్మ తల్లి దీవెనలతో అని కూడా రాసింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాంతార మూవీకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన అంజనీష్ లోక్ నాథ్.. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

అయితే హీరో నితిన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. నితిన్ చాలా సినిమాల్లో పవర్ స్టార్ రిఫరెన్స్ లు కనిపిస్తుంటాయి. పలు సినిమాల ఈవెంట్స్ కు ముఖ్యఅతిథిగా పవన్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పవన్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తోనే నితిన్ థియేటర్లలోకి రాబోతున్నారు. మరి నితిన్ కు ఈ సినిమా ఎలాంటి హిట్ తెచ్చిపెడుతుందో చూడాలి.