Begin typing your search above and press return to search.

నితిన్ శ్రీలీల ఊర మాస్ డప్పుల మోత

టాలీవుడ్ హీరో నితిన్ ఈసారి ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ అనే సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని అనుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 8:59 AM GMT
నితిన్ శ్రీలీల ఊర మాస్ డప్పుల మోత
X

టాలీవుడ్ హీరో నితిన్ ఈసారి ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ అనే సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. ఇక అతను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ తో అయితే చిత్ర యూనిట్ సభ్యులు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ కు జోడిగా శ్రీ లీల నటించిన విషయం తెలిసిందే. ఇక మరొక పాటను కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. ఓలే ఓలే అమ్మాయి అనే పాట ప్రోమోను రీసెంట్గా విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.


పాటలో నితిన్ శ్రీల ఇద్దరూ కూడా మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నితిన్ ప్రతి సినిమాలో కూడా డాన్స్ తో కూడా డిఫరెంట్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అతనికి జోడిగా ఈసారి శ్రీల కలవడంతో వీరి కలయిక విజిల్స్ వేయించేలా ఉందని అనిపిస్తోంది. ఇక హరీష్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

రామ్ మిరియాల పాడిన ఈ ఫుల్ పాట డిసెంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నారు. తప్పకుండా ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని ప్రమోషన్స్ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. ఇక ఈ సినిమా హీరో నితిన్ శ్రీలీల కు మాత్రమే కాకుండా డైరెక్టర్ వక్కంతం వంశీకి కూడా చాలా ఇంపార్టెంట్.

ఎందుకంటే దర్శకుడిగా అతని మొదటి సినిమా నా పేరు సూర్య అంతగా కట్టుకోలేదు. ఇక ఇప్పుడు ఎక్స్ ట్రా సినిమా మాత్రం మంచి సక్సెస్ ఇస్తుంది అని నమ్ముతున్నాడు. ఈ సినిమాతో పాటు పోటీగా నాని హాయ్ నాన్న సినిమా ఒకరోజు ముందుగానే, అంటే డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ పోటీలో నితిన్ ఎక్స్ ట్రా సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.