శైలజ దర్శకుడుకి నితిన్ సెట్ అవుతున్నాడా?
తాజాగా నేను శైలజ ఫేం కిషోర్ తిరుమలను రంగంలోకి దించుతున్నట్లు వినిపిస్తుంది. ఇటీవలే కిషోర్ ...నితిన్ ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ వినిపిం చాడట.
By: Tupaki Desk | 24 May 2025 5:00 PM ISTయూత్ స్టార్ నితిన్ కూడా ఫాం కోల్పోయాడు. 'భీష్మ' తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యాడనుకున్నా? ఆ సక్సెస్ ని కంటున్యూ చేయలేకపోయాడు. అటుపై చేసిన ఐదు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో సక్సెస్ ఇచ్చిన 'భీష్మ'నే మళ్లీ రంగంలోకి దించినా పనవ్వలేదు. అదే 'రాబిన్ హుడ్'. ఇటీవల రిలీజ్ అయిన ఈసినిమా కూడా ప్లాప్ ఖాతాలో పడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చేతిలో ఉంది 'తమ్ముడు' చిత్రం ఒక్కటే. ఆశలన్నీ ఈ సినిమాపైనే. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. త్వరలోనే ఈచిత్రం రిలీజ్ కానుంది.అయితే నితిన్ మాత్రం కొత్త కథలు వింటూనే ఉన్నాడు. సక్సెస్ ఎవరిస్తారా? అని వెతికి మరీ పట్టు కుంటున్నాడు. తాజాగా నేను శైలజ ఫేం కిషోర్ తిరుమలను రంగంలోకి దించుతున్నట్లు వినిపిస్తుంది. ఇటీవలే కిషోర్ ...నితిన్ ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ వినిపిం చాడట.
స్టోరీ నచ్చడంతో ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇంకా ఫైనల్ వెర్షన్ వినిపించాల్సి ఉందిట. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాడు. కిషోర్ కూడా సక్సెస్ ల్లో లేడు.అలాగని అతడు చేసిన సినిమాలు డిజాస్టర్లు కాదు. క్లాసిక్ స్టోరీలతో బాగానే అలరించాడు. `ఉన్నది ఒకటే జిందగీ`, `చిత్రలహరి`, `రెడ్`, `ఆడ వాళ్లు మీకు జోహార్లు` చిత్రాలు పర్వాలేదనిపించాయి. తీసేయాల్సిన సినిమాలు కావవి.
అయితే ఆయన దర్శకుడిగా సినిమా చేసి మూడు నాలుగేళ్లవుతుంది. ఈ గ్యాప్ అతడిపై కొంత ప్రభావాన్ని చూపుతుంది. తదుపరి సినిమాతో హిట్ కొడితే తిరిగి ఫాంలో కి వచ్చినట్లే. ప్రస్తుతం నితిన్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. నితిన్ కి హిట్ అంతే అనివార్యం. ప్రస్తుతం ఆన్ సెట్స్ లో తమ్ముడు చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
