Begin typing your search above and press return to search.

రాబిన్ హుడ్ వేటకు డేట్ సెట్టయ్యింది!

యువ హీరో నితిన్ ఈసారి ఎలాగైనా రాబిన్ హుడ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని సిద్ధమవుతున్నాడు

By:  Tupaki Desk   |   17 April 2024 9:00 AM GMT
రాబిన్ హుడ్ వేటకు డేట్ సెట్టయ్యింది!
X

యువ హీరో నితిన్ ఈసారి ఎలాగైనా రాబిన్ హుడ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. తనకు ఇదివరకే మంచి సక్సెస్ అందించిన దర్శకుడు వెంకీ కుడుముల ఈసారి సరికొత్త స్టైల్ తో నితిన్ చూపించబోతున్నట్లుగా అర్థమవుతుంది. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన భీష్మ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఈసారి దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ లోనే మంచి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను కూడా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ లుక్కుతోనే మెస్మరైజ్ చేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేనంత హై స్టైలిష్ యాక్షన్ తో కనిపించబొతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో చాలా రకాల గాసిప్స్ వైరల్ గా మారాయి.

అయితే మొత్తానికి విడుదల డేట్ విషయంలో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. రాబిన్ హుడ్ సినిమాను డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఇక పోస్టర్ లో కూడా నితిన్ క్యాప్ తో స్టైలిష్ బైక్ పై సీరియస్ గా కూర్చున్న విధానం కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.

ఈ సినిమాలో అతను పవర్ఫుల్ హీరోగా కనిపిస్తాడని సమాచారం. ఇక కథలో ఒక మంచి సందేశం కూడా హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు వెంకీ కుడుముల ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకుంటాడు. అతని మొదటి సినిమా చలో కామెడీ డ్రామాగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నితిన్ తో చేసిన భీష్మలో వ్యవసాయానికి సంబంధించిన అంశంతో పాటు కామెడీ సీన్స్ కూడా హైలెట్ అయ్యాయి.

ఇక ఈసారి రాబిన్ హుడ్ సినిమాలో మరో మంచి కథాంశంను హైలెట్ చేస్తూనే తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ చాలా గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది. రీసెంట్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ కూడా అట్రాక్ట్ చేసింది.

ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ వెన్నెల కిషోర్ లాంటి వారు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మొదటి సాంగ్ విడుదల చేసే అవకాశం ఉంది. మరి రాబిన్ హుడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నితిన్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.