Begin typing your search above and press return to search.

రాబిన్ హుడ్ నితిన్.. గ్లింప్స్ ఎలా ఉందంటే..

కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న లవర్ బాయ్ నితిన్.. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Jan 2024 6:52 AM GMT
రాబిన్ హుడ్ నితిన్.. గ్లింప్స్ ఎలా ఉందంటే..
X

కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న లవర్ బాయ్ నితిన్.. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యంగ్ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ గతేడాది రిలీజై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. దీంతో నితిన్ గట్టి హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు భారీ సక్సెస్ అందించిన వెంకీ కుడుములనే మరోసారి నమ్ముకున్నారు.


వీరిద్దరి కాంబోలో వచ్చిన భీష్మ మూవీ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు నితిన్ కు సరైన హిట్ దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా భీష్మ మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు నితిన్- వెంకీ రెడీ అయ్యారు. రిపబ్లిక్ డే కానుకగా నేడు ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

ఈ మూవీ టైటిల్ ను రాబిన్ హుడ్ గా ప్రకటించారు మేకర్స్. కొద్ది రోజులుగా ఈ సినిమాకు ఇదే టైటిల్ పెడతారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత వినోదభరితమైన & సాహసోపేత ప్రపంచం నుంచి కాన్ మ్యాన్‌ను రివీల్ చేస్తున్నాం. మీ కొత్త కుటుంబ సభ్యుడికి హలో చెప్పండి అంటూ నితిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం నితిన్ పోస్టర్ తోపాటు టైటిల్ గ్లింప్స్ వైరల్ గా మారాయి.

“డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే.. అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటుంది.. అన్నట్టే చేసింది.. దేశమంతా కుటుంబం నాది... ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు.. ఆభరణాలేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు.. అవసరం కొద్దీ వారి జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు.. అయినా నేను హర్ట్ అవ్వలేదు... ఎందుకంటే అయిన వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీయడం నా హక్కు... నా బేసిక్ రైట్.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’’ అంటూ సాగిన పవర్ ఫుల్ డైలాగ్ తో నితిన్ ను పరిచయం చేశారు మేకర్స్.

బ్యాగ్ లో డబ్బు, బంగారంతో శాంటా గెటప్ లో సూపర్ బైక్ పై నితిన్ ఎంట్రీ ఇచ్చారు. బైక్ ఫ్రంట్ పార్ట్ లో ఐయామ్ ఇండియన్ అని.. బ్యాక్ సైడ్ లో నేను చాలా రేర్ అని నాకు తెలుసు అని రాసి ఉన్న బోర్డులు ఉన్నాయి. చివరకు తన బ్యాగ్ లో డబ్బును తీసుకుని ఓ సీక్రెట్ ప్లేస్ లో హీరో దాచిపెడతాడు. మొత్తానికి రాబిన్ హుడ్ గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ఈ సినిమా కోసం నితిన్ స్టైలిష్ మేకోవర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. మోడ్రన్ ఎటైర్ లో కూల్ గా కనిపిస్తున్నారు. వెంకీ కుడుముల.. సీరియస్ సన్నివేశాలను కూడా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించడం బాగుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి టైటిల్ గ్లింప్స్ తోనే తన మార్క్ చూపించారని అంటున్నారు. ప్రొడక్షన్ గ్రాండ్ గా అనిపించిందని సినీ పండితులు చెబుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీ నితిన్ కు కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.