Begin typing your search above and press return to search.

వరుస ఫ్లాప్స్ వచ్చినా నితిన్ స్ట్రాంగ్ రెమ్యునరేషన్!

మరోవైపు, సినిమా విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో నితిన్‌కు రెమ్యునరేషన్ ఇచ్చారా? అని నిర్మాత సుధాకర్ రెడ్డిని జర్నలిస్ట్ ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 3:45 AM GMT
వరుస ఫ్లాప్స్ వచ్చినా నితిన్ స్ట్రాంగ్ రెమ్యునరేషన్!
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. గత కొంత కాలంగా ఎలాంటి సినిమా చేసినా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. భారీగా అంచనాలు పెట్టుకున్న కొన్ని కమర్షియల్ సినిమాలు నితిన్​కు నిరాశే మిగిల్చుతున్నాయి. అప్పుడెప్పుడో వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిమ భీష్మ సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత నటించిన అన్ని సినిమాలు ఏమాత్రం కూడా ఫ్లాప్ అయ్యాయి. కమర్షియల్ ఫార్మాట్ లో గత ఏడాది వచ్చిన మాచర్ల నియోజకవర్గం కూడా డిజాస్టర్ అయింది.

రీసెంట్ గా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డనరీ మ్యాన్ కూడా ఫ్లాప్ టాక్ అందుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అభిమానులు కాలర్ ఎగరేసుకుంటూ వస్తారని నమ్మకంతో చెప్పిన నితిన్.. సినిమాతో మరోసారి నిరాశపరిచారు. సినిమా కోసం నితిన్ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్లాన్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. నితిన్ కు కెరీర్ లో ఇది పెద్ద దెబ్బె అనే మాట వినిపిస్తోంది. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్​తో ఎక్స్​ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను మేకర్స్ తెరకెక్కించారు.

అయితే మేకర్స్ బడ్జెట్ విషయం పట్టించుకోకుండా హై రేంజ్ లో రూపొందించారు. ఇక టేబుల్ ప్రాఫిట్ కూడా వచ్చింది.. కాని సినిమాను నమ్ముకున్న ​డిస్ట్రిబ్యూటర్స్ కు మాత్రం భారీ నష్టాలు మిగిల్చింది. అయితే వరుస సినిమాలు ఫ్లాప్స్​ అవుతున్నా ఈ మూవీకి నితిన్ సాలిడ్ గానే రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మించడం గమనార్హం.

మరోవైపు, సినిమా విడుదలకు ముందు ఒక ఇంటర్వ్యూలో నితిన్‌కు రెమ్యునరేషన్ ఇచ్చారా? అని అతని తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డిని ప్రశ్నించారు. అందుకు ఆయన సినిమా రిలీజ్ తర్వాత రెమ్యునరేషన్ ఇస్తా అని సమాధానం చెప్పారు. వెంటనే తండ్రి దగ్గర నుంచి మైక్ తీసుకున్న నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఇంతకు ముందు నాకు పెళ్లికాలేదు కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.. అయితే ఇప్పుడు నాకు పెళ్లయింది కాబట్టి నా డబ్బులు నాకు రావాల్సిందే. నాకూ ఒక ఫ్యామిలీ ఉంది.. నేను బాగా ఎదగాలి" అంటూ సరదాగా చెప్పాడు నితిన్. అయితే నితిన్ తనకు భీష్మ వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమూరుతో మళ్లీ సినిమా చేయనున్నారు. ఆ సినిమాకు కూడా దాదాపు 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. ఇక ఈ సినిమాతో అయినా నితిన్​కు వెంకీనే మంచి సక్సెస్ ఇస్తాడో లేదో.