Begin typing your search above and press return to search.

తమ్ముడు మళ్లీ ఇష్క్‌ లో పడబోతున్నాడా..?

అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు

By:  Tupaki Desk   |   18 March 2024 11:30 PM GMT
తమ్ముడు మళ్లీ ఇష్క్‌ లో పడబోతున్నాడా..?
X

యంగ్‌ హీరో నితిన్ సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. ఇటీవలే ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు నిరాశే మిగిలింది. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

ఇప్పటికే తమ్ముడు సినిమాను చేస్తున్న నితిన్ మరో వైపు రాబిన్ హుడ్‌ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా కొత్తగా మరో సినిమాకు నితిన్ కమిట్‌ అయ్యాడని, ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో ఇష్క్‌ సినిమాను దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో చేసిన నితిన్ మరోసారి ఆయన తో జత కట్టబోతున్నాడు. ఆ మధ్య ఇష్క్‌ సీక్వెల్‌ అనే ప్రచారం జరిగింది. కానీ కొత్త కథ తో వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది అన్నట్లుగా సమాచారం అందుతోంది.

విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంతో నితిన్‌ ఈ కొత్త సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

హిట్‌ కాంబో అవ్వడంతో పాటు, ప్రేమ కథ లను చక్కగా డీల్ చేయగల దర్శకుడు విక్రమ్ కుమార్‌ దర్శకత్వంలో లవర్ బాయ్ నితిన్ హీరోగా రూపొందబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు కచ్చితంగా భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా విషయమై త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.