Begin typing your search above and press return to search.

నితిన్.. ఈసారి హిట్టు కాంబో..

యంగ్ హీరో నితిన్ చివరిగా ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు

By:  Tupaki Desk   |   18 March 2024 5:30 AM GMT
నితిన్.. ఈసారి హిట్టు కాంబో..
X

యంగ్ హీరో నితిన్ చివరిగా ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దానికి ముందు మాచర్ల నియోజకవర్గం, రంగ్ దే కూడా డిజాస్టర్ జాబితాలో చేరాయి. కచ్చితంగా నితిన్ కి నెక్స్ట్ సాలిడ్ హిట్ కావాల్సి ఉంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే మూవీ నితిన్ చేస్తున్నాడు. అలాగే వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా తెరకెక్కుతోంది.

ఈ రెండు సినిమాలు తనని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొని వస్తాయని నితిన్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మూవీని కూడా నితిన్ కన్ఫర్మ్ చేశాడు. తన కెరియర్ లో వరుస డిజాస్టర్స్ తర్వాత ఇష్క్ మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్. సింపుల్ క్యూట్ లవ్ స్టోరీని జనాలకి కనెక్ట్ అయ్యే విధంగా ప్రెజెంట్ చేసి నితిన్ లో కామెడీ యాంగిల్ ని ఇష్క్ మూవీ ఆడియన్స్ కి విక్రమ్ కె కుమార్ పరిచయం చేశాడు.

ఈ సినిమా తర్వాత నితిన్ గాడిలో పడ్డాడు. సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ క్లాస్ టచ్ ఉన్న కథలతో సక్సెస్ లు అందుకున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత మరల విక్రమ్ కె కుమార్ తో నితిన్ జతకడుతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారంట. వరుస హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో ఉన్న నితిన్ కి ఈ సినిమా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుందని భావిస్తున్నాడు.

అయితే విక్రమ్ కె కుమార్ చివరిగా థాంక్యూ సినిమాతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. అలాగే అంతకుముందు నానితో చేసిన గ్యాంగ్ లీడర్ కూడా పెద్దగా క్లిక్ కాలేదు. రీసెంట్ గా దూత వెబ్ సిరీస్ తో సత్తా చాటాడు. ఇప్పుడు నితిన్ తో మూవీని సెట్ చేసుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో అంటేనే ఎంత వరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది డౌట్ గా ఉంది.

విక్రమ్ కె కుమార్ అయితే టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పాలి. మంచి కథ సెట్ అయితే సక్సెస్ రావడం ఖాయం. 24 - మనం లాంటి సినిమాల్లో అతని మేకింగ్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ బాగా హైలెట్ అయ్యింది. అందుకే అతను ఫ్లాప్ లో ఉన్నా కూడా సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు సిద్ధంగా ఉంటారు. ఇక ఇప్పుడు నితిన్ తో మరో కథను రెడీ చేసే పనిలో పడ్డాడు. ఇక ఈ కాంబోలో మూవీని హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. త్వరలో సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉంది.