Begin typing your search above and press return to search.

వెంకీ చేతుల్లో నితిన్ కెరీర్..!

ఆ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్నా దానికి సంబందించిన మిగతా డీటైల్స్ మాత్రం బయటకు రాలేదు. నితిన్ తో వెంకీ ఆల్రెడీ భీష్మ సినిమా తీసి హిట్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 1:30 AM GMT
వెంకీ చేతుల్లో నితిన్ కెరీర్..!
X

లవర్ బాయ్ నితిన్ కెరీర్ ఎప్పుడు హిట్లు ఫ్లాపులతో సమతూకం చేసుకుంటూ వస్తుంది. ఏ హీరోకి రానటువంటి ఫ్లాపులు నితిన్ కు వచ్చినా తిరిగి మళ్లీ ఫాంలోకి వచ్చి తన సత్తా చాటాడు. ప్రేక్షకులు తనని ఎలా చూడాలని అనుకుంటున్నారో కనిపెట్టిన నితిన్ ఆ పంథాలో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అయితే అందులో కొన్ని అతని టార్గెట్ రీచ్ అవుతుంటే మరికొన్ని మాత్రం వర్క్ అవుట్ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న మాచర్ల నియోజకవర్గం సినిమా చేసిన నితిన్ ఆ సినిమా రిజల్ట్ తో షాక్ అయ్యాడు. చాలా గ్యాప్ తర్వాత కమర్షియల్ యాంగిల్ ట్రై చేసిన నితిన్ సక్సెస్ అవ్వలేకపోయాడు.

ఇక రీసెంట్ గా ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాతో మరో ప్రయత్నం చేశాడు నితిన్. ఆ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. రైటర్ గా ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న వక్కంతం వంశీ డైరెక్టర్ గా మాత్రం సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. అల్లు అర్జున్ తో చేసిన నా పేరు సూర్య కూడా భారీ హైప్ తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడగా నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కూడా ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యింది.

నితిన్ సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమా లాస్ ప్రాజెక్ట్ గా నిలిచింది. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుములతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్నా దానికి సంబందించిన మిగతా డీటైల్స్ మాత్రం బయటకు రాలేదు. నితిన్ తో వెంకీ ఆల్రెడీ భీష్మ సినిమా తీసి హిట్ అందుకున్నాడు. నితిన్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆ సినిమా సక్సెస్ అయ్యింది. మళ్లీ ఈసారి ఆ కాంబోలో అలాంటి హిట్టే ఆశిస్తున్నారు ఆడియన్స్.

ఛలో తో డైరెక్టర్ గా తన తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న వెంకీ కుడుముల సెకండ్ సినిమా భీష్మతో కూడా హిట్ కొట్టాడు. భీష్మ తర్వాత మళ్లీ నితిన్ తోనే తన థర్డ్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు వెంకీ. నితిన్ కూడా వెంకీ తో ఆల్రెడీ హిట్ ఉంది కాబట్టి అదే నమ్మకంతో మరో సినిమా చేస్తున్నాడు. మరి ఈ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

నితిన్ వెంకీ కుడుముల కాంబో రెండో ప్రాజెక్ట్ లో ముందు రష్మికను హీరోయిన్ గా అనౌన్స్ చేసినా సరే ఏమైందో ఏమో కానీ మళ్లీ అమ్మడు సినిమా నుంచి క్విట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.