Begin typing your search above and press return to search.

ఎల్లమ్మ కోసం నితిన్ మేకోవర్..?

నితిన్ తమ్ముడు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీరాం వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో లయ, సప్తమి గౌడ, వర్ష నటించారు

By:  Tupaki Desk   |   2 July 2025 8:00 AM IST
ఎల్లమ్మ కోసం నితిన్ మేకోవర్..?
X

నితిన్ తమ్ముడు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీరాం వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో లయ, సప్తమి గౌడ, వర్ష నటించారు. సినిమాకు అజనీష్ లోకనాథ్ ఇచ్చిన మ్యూజిక్ ఒక హైప్ తెచ్చింది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన తమ్ముడు సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐతే ఈ సినిమా తర్వాత నితిన్ ఇదే బ్యానర్ లో ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. బలగం వేణు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

బలగం తో ఒక ఎమోషనల్ రైడ్ ని చూపించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న వేణు ఈసారి ఎల్లమ్మ కథతో మరో అద్భుతాన్ని చేయాలని చూస్తున్నాడు. ఐతే ఎల్లమ్మ సినిమా కోసం నితిన్ తన లుక్ మార్చబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్ జుట్టుని ఎక్కువగా పెంచుకుంటాడని తెలుస్తుంది. అంతేకాదు గడ్డం తో కూడా న్యాచురల్ గా రఫ్ లుక్ వచ్చేలా ట్రై చేస్తున్నారట. సినిమాలో నితిన్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఈ పాత్ర కోసం నితిన్ తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడని అర్ధమవుతుంది. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో నితిన్ క్యాప్ తో కనిపిస్తున్నాడు. సో అది ఎల్లమ్మ సినిమా కోసమే అన్నట్టుగా తెలుస్తుంది. నితిన్ మేకోవర్ తో ఎల్లమ్మ సినిమాపై మరింత క్రేజ్ వస్తుందని తెలుస్తుంది. ఇక ఎల్లమ్మ సినిమాలో మరో హైలెట్ గా కీర్తి సురేష్ కానుందని తెలుస్తుంది. సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ తో మళ్లీ మళ్లీ చూసేలా చేస్తుందని అంటున్నారు. అలా మొత్తానికి ఎల్లమ్మ సినిమా కోసం లీడ్ యాక్టర్స్ రెడీ అవుతున్నారు.

ఇక బలగం సినిమాతో ఇచ్చిన బడ్జెట్ లోనే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందించిన వేణు ఈసారి అడిగినంత బడ్జెట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి చేసే వరకు చిత్ర యూనిట్ అంతా ఒక ఫోకస్ తో ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఎల్లమ్మ సినిమాను నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

దిల్ రాజుకి ఎల్లమ్మ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటన్నది ఈమధ్య ఇంటర్వ్యూలో ఎల్లమ్మతో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాడు. సో దిల్ రాజు అంత నమ్మకంగా చెప్పాడంటే నితిన్ దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు