Begin typing your search above and press return to search.

'తమ్ముడు' ముగ్గురి కోసం హిట్‌ కావాలి..!

తాజాగా తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వైభవంగా జరిగింది. నితిన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలకు పైగానే అయింది.

By:  Tupaki Desk   |   1 July 2025 4:56 AM
తమ్ముడు ముగ్గురి కోసం హిట్‌ కావాలి..!
X

నితిన్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'తమ్ముడు' సినిమా విడుదలకు సిద్ధం అయింది. జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను దాదాపుగా రెండేళ్ల పాటు చేయడంతో బడ్జెట్‌ భారీగా పెరిగింది. దాంతో దర్శకుడు వేణు శ్రీరామ్‌, హీరో నితిన్‌లు తమ పారితోషికం వెనక్కి ఇచ్చేశారని, సినిమా హిట్ అయితేనే పారితోషికం తీసుకుంటామని చెప్పారని దిల్‌ రాజు స్వయంగా చెప్పుకొచ్చాడు. సినిమా మేకింగ్‌కు చాలా సమయం పట్టడం వెనుక ఉన్న పలు కారణాలను దర్శకుడు వేణు, నిర్మాత దిల్‌ రాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తప్పకుండా తమ్ముడు హిట్ అవుతుందనే విశ్వాసంతో అంతా ఉన్నారు.

తాజాగా తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వైభవంగా జరిగింది. నితిన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలకు పైగానే అయింది. ఆయన ఈ మధ్య కాలంలో వరుసగా నిరాశ పరుస్తూ వస్తున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఈ మధ్య తాను చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం నిరాశను కలిగించిందని చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నితిన్ మాట్లాడుతూ తమ్ముడుపై తనకు ఉన్న నమ్మకంను చెప్పుకొచ్చాడు. దిల్‌ రాజు తమపై నమ్మకంతో భారీ బడ్జెట్‌ ఖర్చు చేశారని, ఆయన నమ్మకం వమ్ము కాదు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు బాగా తెలుసు అన్నాడు.

ఇంకా నితిన్‌ మాట్లాడుతూ... ఈ సినిమా ముగ్గురి కోసం హిట్‌ కావాలని బలంగా కోరుకుంటున్నాను. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన కోసం ఈ సినిమా కచ్చితంగా హిట్‌ కావాలి. ఈ సినిమా హిట్ అయితేనే ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని నితిన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక నన్ను ఇష్టపడే వారి కోసం ఈ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. వారు నా విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనుక వారి కోసం ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక నా సినిమాలు విజయం సాధిస్తే ఆనందించే వారు, ఫ్లాప్‌ అయితే బాధ పడే వారి కోసం కూడా ఈ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు సినిమాలు ఫ్లాప్‌ కావడంతో అభిమానులకు నితిన్‌ క్షమాపణలు చెప్పాడు. ఇకపై మంచి సినిమాలు మాత్రమే చేస్తానని నితిన్ ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చాడు.

సీనియర్‌ హీరోయిన్‌ లయ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. చాలా ఏళ్ల తర్వాత లయ నటించిన సినిమా కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. నితిన్‌కి అక్క పాత్రలో లయ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడలు హీరోయిన్స్‌గా నటించారు. కాంతార తర్వాత విభిన్నమైన పాత్రతో సప్తమి గౌడ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరో నితిన్‌తో ఈమె కాంబో సీన్స్ సినిమాలో పెద్దగా ఉండవట. అయినా కూడా కథ లో అత్యంత కీలకమైన పాత్రగా చెబుతున్నారు. నితిన్‌తో కలిసి కేవలం రెండు గంటల షూట్‌ మాత్రమే చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో సప్తమి గౌడ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో వర్ష బొల్లమ్మ కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.