`తమ్ముడు` రిలీజ్ డేట్ మారింది!
కొత్త కథలని నమ్మి చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో జాగ్రత్త పడుతున్న నితిన్ ఈ సారి ఎలాగైనా హిట్‌ని దక్కించుకుని బలంగా కమ్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నాడు.
By: Tupaki Desk | 14 May 2025 4:01 PM ISTవరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న హీరో నితిన్. భీష్మ తరువాత ఆ స్థాయి సక్స్‌ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. కొత్త కథలని నమ్మి చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో జాగ్రత్త పడుతున్న నితిన్ ఈ సారి ఎలాగైనా హిట్‌ని దక్కించుకుని బలంగా కమ్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగా దిల్ రాజు నిర్మిస్తున్న `తమ్ముడు`పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. `వకీల్ సాబ్` తరువాత స్టార్ హీరోల వెంట పరుగెత్తి ఏ హీరో కుదరకపోవడంతో నితిన్‌ని పట్టుకున్నాడు వేణు శ్రీరామ్.
తను రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ `తమ్ముడు`. పవన్ కల్యాణ్ హిట్ టైటిల్ కావడం, పవన్‌కు నితిన్ వీరాభిమాని కావడంతో ఈ మూవీపై పవన్ అభిమానులతో పాటు నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. నితిన్ కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాడు. `కాంతార` ఫేమ్ సప్తమిగౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ మూవీతో హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తోంది. తను ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తోంది.
దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో నితిన్‌కు `శ్రీనివాస కల్యాణం`తో ఫ్లాప్‌ని అందించిన దిల్‌రాజు ఈ మూవీతో హిట్‌ని అందించాలనే పట్టుదలతో ఉన్నారట. అందుకే శ్రీరామ్ వేణుతో పక్కా కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా కథని రెడీ చేయించి ఈ మూవీ చేశారని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. యూనిట్ కూడా సినిమా రిలీజ్ ఎప్పుడు అని రీల్స్ చేశారంటే ఈ మూవీ రిలీజ్ కోసం టీమ్ ఎంతగా ఎదురు చూస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఫైనల్లీ ఈ మూవీ రిలీజ్ డేట్ కన్షర్మ్ అయింది. ముందు డైరెక్టర్ శ్రీరామ్‌వేణు పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోని విడుదల చేసి అందులో రిలీజ్ డేట్‌ని ప్రకటించడం తెలిపసిందే. జూలై 4న వస్తున్నాం అంటూ ప్రకటించారు. అయితే తాజాగా ఆ డేట్ మారినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ మూవీని జూలై 24న రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయించారట. ఈ డేట్‌ని టీమ్ అఫీషియల్‌గా త్వరలో ప్రకటించబోతోంది.
