ఈ తమ్ముడు కోసం ఆ తమ్ముడు వస్తాడా..?
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా జూలై 4న రిలీజ్ అవుతుంది.
By: Tupaki Desk | 30 Jun 2025 9:24 AM ISTనితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా జూలై 4న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో నితిన్ సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లయ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ కూడా హైలెట్ అవ్వనున్నాడని తెలుస్తుంది.
ఆల్రెడీ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ భూ అంటూ భూతం వచ్చి, జై బగళాముఖి రెండు సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం సాంగ్స్ హిట్ అవ్వడం ఇలా అన్నీ కూడా తమ్ముడికి కలిసి వస్తున్నాయి. ఐతే జూలై 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రెండు మూడు రోజుల్లో ఉండనుంది. ఐతే తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరన్న డిస్కషన్ మొదలైంది.
తమ్ముడు టైటిల్ తో ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టారు. అరుణ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా అప్పటి యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఐతే ఆ తమ్ముడు కథ వేరు ఈ తమ్ముడి కథ వేరు. నితిన్ తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆ తమ్ముడు అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఐతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో మాత్రమే కాదు ఏపీకి ఉప ముఖ్యమంత్రి కూడా.. సో ఆయన పర్మిషన్ కోసం తమ్ముడు టీం ప్రయత్నిస్తుందట.
ఒకవేళ నితిన్ తమ్ముడు సినిమా ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం కచ్చితంగా సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఆ తమ్ముడికి ఈ తమ్ముడికి అసలేమాత్రం సంబంధం లేదు. అంతేకాదు నితిన్ పవర్ స్టార్ కి వీరాభిమాని మరి నితిన్ తమ్ముడు కోసం పవన్ వస్తాడా లేదా అన్నది చూడాలి. నితిన్ సినిమా ఈవెంట్స్ కి పవన్ కళ్యాణ్ వస్తే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. ఐతే ప్రస్తుతం ఈ టైం లో పవన్ అందుకు ఓకే చెబుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
