వరుస ఫ్లాపుల నుంచి పవన్ టైటిల్ కాపాడుతుందా?
ఎవరైనా వరుస ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతుంటే గజినీ మెహమ్మద్‌లా దండయాత్ర చేస్తున్నాడంటాం.
By: Tupaki Desk | 21 April 2025 6:00 PM ISTఎవరైనా వరుస ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతుంటే గజినీ మెహమ్మద్‌లా దండయాత్ర చేస్తున్నాడంటాం. అదే తరహాలో హీరో నితిన్ సక్సెస్‌ఫుల్ హీరోగా నిలబడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. `సై` తరువాత నితిన్ హిట్ అనే మాట వినడానికి ఎనిమిదేళ్లు పట్టింది. 2004లో `సై`తో హిట్‌ని అందుకున్న నితిన్ ఎనిమిదేళ్ల తరువాత అంటే 2012లో విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన `ఇష్క`తో సక్సెస్‌ని సొంతం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఫ్లాపులు ఎదుర్కొన్న నితిన్ `అఆ`తో మరోసారి ట్రాక్‌లోకి వచ్చాడు.
మళ్లీ సక్సెస్‌కు బ్రేక్ పడింది. వరుస మూడు ఫ్లాపులు ఎదురయ్యాయి. భీష్మ, రంగ్‌దే సినిమాలతో మళ్లీ హిట్టు బాటపడ్డాడు కానీ తరువాత వరుసగా ఫ్లాపులే పలకరించడం మొదలు పెట్టాయి. మాస్ట్రో, మాచర్లనియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీమ్యాన్..ఇలా వరుసగా మూడు ఫ్లాపులు ఎదుర్కొన్న నితిన్ చివరగా `రాబిన్ హుడ్`తో యావరేజ్ అనిపించుకున్నాడు. ఏదో అనుకుని తీస్తే ఈ సినిమా మరేదో అయింది. `జెంటిల్‌మెన్` మూవీలోని అర్జున్ క్యారెక్టర్‌ని ఫాలో అవుతూ నితిన్ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన వెంకీ కుడుముల సెండ్ హాఫ్‌కి వచ్చేసరికి కథని మొత్తం కంగాళీగా చేసి `ఎత్తుకున్న రాగమేంటీ.. పాడుతున్న తాళమేంటీ` అన్నచందంగా కథని దారి తప్పించడంతో సినిమా ఫలితం తారుమారై తీవ్ర నిరాశకు గురిచేసింది.
దీంతో నితిన్ ఖాతాలో `రాబిన్ హుడ్` యావరేజ్ ఫిల్మ్‌గా నిలిచింది. దీంతో ఆలోచనలో పడిన నితిన్ ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్‌ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే పట్టుదలతో ఉన్నాడట. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో `తమ్ముడు` మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. చాలా కాలం తరువాత నటి లయ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. అక్కా - తమ్ముడు నేపథ్యంలో సాగే సెంటిమెంట్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వరుస ఫ్లాపుల తరువాత వస్తున్న సినిమా కావడం, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హిట్ టైటిల్ కావడంతో ఈ సినిమాపై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడట.
ఈ నేపథ్యంలోనే పవన్ టైటిల్ అయినా నితిన్‌ని కాపాడుతుందా? అనే చర్చ సర్వత్రా మొదలైంది. దిల్ రాజు బ్యానర్ మార్కు ఫ్యామిలీ ఎమోషన్‌తో రూపొందిన ఈ సినిమాని జూలై 4న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అప్పుడైతే ఎలాంటి పోటీ ఉండదని, ఆ టైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే `తమ్ముడు` పవన్ సెంటిమెంట్‌తో నితిన్‌కు హిట్ ఇస్తుందా? అన్నది తెలియాలంటే జూలై 4 వరకు వేచి చూడాల్సిందే.