Begin typing your search above and press return to search.

తమ్ముడు సెంటిమెంట్ తో కుమ్మేస్తాడా..?

రాబిన్ హుడ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ కి ఆ సినిమా నిరాశ మిగిల్చింది.

By:  Tupaki Desk   |   13 April 2025 10:31 AM IST
తమ్ముడు సెంటిమెంట్ తో కుమ్మేస్తాడా..?
X

రాబిన్ హుడ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ కి ఆ సినిమా నిరాశ మిగిల్చింది. ఆల్రెడీ వెంకీ కుడుములతో భీష్మ లాంటి హిట్ అందుకున్న నితిన్ రెండోసారి అంతకుమించి హిట్ అందుకుంటారని అనుకోగా ఏమాత్రం అంచనాలను అందుకోలేదు. నితిన్, శ్రీలీల కలిసి చేసిన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కూడా డిజాస్టర్ కాగా ఆ దారిలోనే రాబిన్ హుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఐతే నితిన్ నెక్స్ట్ సినిమాల మీద రాబిన్ హుడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే చెప్పడం కష్టమని చెప్పొచ్చు.

నితిన్ నెక్స్ట్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమ్ముడు సినిమా టైటిల్ తోనే ఇదొక సెంటిమెంట్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నటిస్తుంది. నితిన్, లయ ఇద్దరి మధ్య సీన్స్ ఒక రేంజ్ లో వర్క్ అవుట్ అవుతాయని అంటున్నారు. నితిన్ తమ్ముడు సినిమా లో ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ దట్టంగా ఉంటుందని టాక్.

తమ్ముడు సెంటిమెంట్ తోనే నెట్టుకొస్తాడని అంటున్నారు. నితిన్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వేణు శ్రీరామ్ సినిమాలు మినిమం గ్యారెంటీ ఉంటాయి. డైరెక్షన్ లో అతని మార్క్ చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తాడు. దిల్ రాజు కాంపౌండ్ లో సినిమా అంటే కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకం ఉంది. నితిన్ కష్టాల్లో ఉన్నప్పుడు దిల్ రాజు సినిమాలు సేవ్ చేస్తాయి.

ఈ క్రమంలో వరుస ఫెయిల్యూర్స్ తో నితిన్ ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. అందుకే తమ్ముడు సినిమాతో అతనికో సూపర్ హిట్ అందించాలని చూస్తున్నారు. నితిన్ తమ్ముడు తర్వాత వేణు యెల్దండితో ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నెక్స్ట్ మంత్ మొదలు కాబోతుంది. తమ్ముడు మాత్రమే కాదు ఎల్లమ్మ కూడా పర్ఫెక్ట్ గురితో రాబోతున్నాడని తెలుస్తుంది.

బలగంతో సూపర్ హిట్ అందుకున్న వేణు ఎల్లమ్మతో మరో సూపర్ స్టోరీతో వస్తున్నాడని తెలుస్తుంది. రాబిన్ హుడ్ గురి తప్పినా కూడా రాబోతున్న తమ్ముడు, ఎల్లమ్మ ఈ రెండు సినిమాలతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాలతో నితిన్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. నితిన్ కి ఫ్లాపులు కొత్తేమి కాదు కానీ అతను మళ్లీ సక్సెస్ కొట్టడం కూడా రొటీనే.. ఐతే రాబోతున్న తమ్ముడు, ఎల్లమ్మ సినిమాలతో తన పంథా కూడా మార్చబోతున్నాడని తెలుస్తుంది.