Begin typing your search above and press return to search.

పాపం 'తమ్ముడు' ఇబ్బంది పడుతున్నాడు..!

నితిన్‌ హీరోగా సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన 'తమ్ముడు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

By:  Tupaki Desk   |   4 Jun 2025 7:42 PM IST
Thammudu Postponed Again: Nithiin Fans Await Solo Release Slot
X

నితిన్‌ హీరోగా సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన 'తమ్ముడు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సినిమాను విడుదల చేయడానికి ఇతర సినిమాలు అడ్డుగా ఉన్నాయి. మొన్నటి వరకు తమ్ముడు సినిమాను జులై 4న విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'కింగ్డమ్‌' సినిమా రాబోతున్న నేపథ్యంలో వాయిదా వేశారు. జూన్‌లో కూడా తమ్ముడు సినిమా కోసం మంచి తేదీని చూశారు. కానీ ఏ ఒక్కరూ తమ్ముడు సినిమా కోసం వెనక్కి తగ్గలేదు.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్‌, పోస్టర్స్‌ ఆసక్తిని పెంచడంలో సక్సెస్‌ అయ్యాయి అని చెప్పాలి. వేణు శ్రీరామ్‌ అంటే ఒక మోస్తరు అంచనాలు క్రియేట్‌ అవుతాయి. ఆయన నుంచి వచ్చిన సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకే ఈ సినిమా విషయంలో నితిన్ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తమ్ముడు సినిమా విడుదల విషయంలో జాప్యం అసలు చేయకూడదు. కానీ మేకర్స్ మాత్రం విడుదల విషయంలో ఒక స్ట్రాంగ్‌ నిర్ణయాన్ని తీసుకుని, దానిపై నిలబడలేక పోతున్నారు. నితిన్‌ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గుతున్నారు.

ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్‌ను పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అక్క, తమ్ముడు కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను గురించి మేకర్స్‌ ముందు నుంచి విభిన్నంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ సినిమాతో సీనియర్‌ హీరోయిన్‌ లయ రీ ఎంట్రీకి సిద్ధం అయ్యారు. చాలా కాలం తర్వాత లయ ఈ సినిమాలో నటించడంతో ఆసక్తి పెరిగింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఈ సినిమాను రూపొందించాడు అనే విశ్వాసంను మేకర్స్‌ మొదలుకుని అంతా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను దిల్‌ రాజు బ్యానర్‌ లో రూపొందించిన కారణంగా ఇండస్ట్రీలోనూ అంచనాలు ఉన్నాయి.

ఇతర సినిమాలకు పోటీగా ఉండవద్దు అనే ఉద్దేశంతో తమ్ముడు సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. సోలో రిలీజ్ కోసం చాలా కష్టపడుతున్నారు. ముందు ముందు అయినా తమ్ముడికి ఇబ్బంది లేకుండా సోలో రిలీజ్ దక్కేనా చూడాలి. సోషల్‌ మీడియాలో తమ్ముడు సినిమాకు బజ్ క్రియేట్‌ అయ్యే విధంగా ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం జులై చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు గాను దిల్‌ రాజు అండ్‌ టీం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. త్వరలోనే ఆ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.