తమ్ముడికి అన్ని కలిసొస్తున్నాయ్..!
సో నితిన్ తమ్ముడికి అంతా కలిసి వస్తుంది. ఇక థియేటర్ కి ఆడియన్స్ రావట్లేదు అనుకుంటున్న టైం లో లాస్ట్ వీక్ రిలీజైన కుబేర సూపర్ సక్సెస్ అందుకుంది.
By: Tupaki Desk | 23 Jun 2025 8:47 PM ISTనితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తమ్ముడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా లయ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత లయ నటించిన సినిమాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. ఐతే తమ్ముడు సినిమా టీజర్, ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. నితిన్ రాబిన్ హుడ్ సినిమా ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని తమ్ముడు మీద స్పెషల్ ఫోకస్ చేశాడు.
తమ్ముడు సినిమాకు అన్ని మంచి శకునములే అనిపించేలా ఉన్నాయి. నితిన్ సినిమాకు ఎప్పుడు లేని బజ్ తమ్ముడు మూవీకి కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ తర్వాత సినిమాపై ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇక అజనీష్ ఇస్తున్న మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేసేలా ఉంది. సినిమా నుంచి వచ్చిన భూ అంటూ భూతం వచ్చి సాంగ్ ఆడియన్స్ ని అలరించింది. సినిమా ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సాంగ్ కూడా హిట్ అయ్యింది.
సో నితిన్ తమ్ముడికి అంతా కలిసి వస్తుంది. ఇక థియేటర్ కి ఆడియన్స్ రావట్లేదు అనుకుంటున్న టైం లో లాస్ట్ వీక్ రిలీజైన కుబేర సూపర్ సక్సెస్ అందుకుంది. సో మరో రెండు వారాల్లో రాబోతున్న నితిన్ తమ్ముడికి ఇది మంచి విషయమని చెప్పొచ్చు. తమ్ముడు సినిమా కంటెంట్ ఉన్న సినిమాగా కనబడుతుంది. ముఖ్యంగా ఊరు అక్కడికి వెళ్లడం రావడానికి ఒకటే దారి అందులో కొంతమంది వ్యక్తులు ఇదంతా ఒక మిస్టీరియస్ థింగ్ గా ఉన్నాయి.
ఇక ఇచ్చిన మాట కోసం అంటూ అక్క సెంటిమెంట్ ని బలంగా చెప్పబోతున్నాడు తమ్ముడు. సో వేణు శ్రీరామ్ కథ కథనం కచ్చితంగా ఆడియన్స్ ని సినిమా మెచ్చేలా చేసేలా ఉన్నాయి. సినిమాకు సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా పాజిటివిటీ తెచ్చింది కాబట్టి థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తే మాత్రం ఇక సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క. నితిన్ తమ్ముడు సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుండగా ఈ సినిమాతో హిట్టు కొట్టి నెక్స్ట్ ఎల్లమ్మ సినిమాకు సంసిద్ధం అవ్వాలని చూస్తున్నాడు.
