ఇది ట్రైలర్ కాదు బ్యాంగర్: ఊహించని మిస్టరీలో 'తమ్ముడు'
ఇందులో అక్క తమ్ముడు ఎమోషన్ తో పాటు ఒక పసిపాప అంశాన్ని కూడా హైలెట్ చేశారు. సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎలిమెంట్స్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది.
By: Tupaki Desk | 11 Jun 2025 11:45 AMయువ హీరో నితిన్ ఈసారి మరో డిఫరెంట్ కధతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు సినిమా టీజర్ నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి లయ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది.
ఆమె హీరో నితిన్ కు అక్క పాత్రలో కనిపించబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన కథ ఎలా ఉండబోతోంది అది అనే విషయంలో రకరకాల గాల్సిప్స్ వినపడగా. ఇప్పుడు ట్రైలర్ తరహాలో కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తూ బ్యాంగర్ పేరుతో వీడియో రిలీజ్ చేశారు. సినిమా కాన్సెప్ట్ పై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సినిమాలో ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త కాన్సెప్ట్ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు అలాగే ఇచ్చిన మాట ప్రాణం కంటే విలువైంది అనే అంశాన్ని ఇందులో హైలెట్ చేసినట్లుగా అర్థమవుతుంది.
సినిమాలో యాక్షన్ డోస్ తో పాటు ఒక గ్రామంలోని మిస్టరీ కూడా ఎంతో క్యూరియసిటీ ని క్రియేట్ చేస్తుంది. ఇక తన సోదరి తో తమ్ముడు అని పిలిపించుకోవడానికి అతను ఎంతవరకు వెళ్ళాడు అనే మరొక పాయింట్ కూడా ఈ ట్రైలర్ లో హైలైట్ అయింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి.
ఇందులో అక్క తమ్ముడు ఎమోషన్ తో పాటు ఒక పసిపాప అంశాన్ని కూడా హైలెట్ చేశారు. సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎలిమెంట్స్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. తప్పకుండా ఈసారి నితిన్ తన పాత్రలో మాత్రమే కాకుండా సరికొత్త ఎమోషన్ తో ఆకట్టుకోబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి.
ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికి పలు కారణాలతో సినిమాను వాయిదా వేసుకోవచ్చారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా లలో ప్రతి అంశం కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లుగా ట్రైలర్తో మరోసారి క్లారిటీ ఇచ్చారు.
కేవలం సిస్టర్ సెంటిమెంట్ మాత్రమే కాకుండా ఒక గ్రామీణ నేపథ్యం చరిత్ర అలాగే ఒక సరికొత్త మిస్టరీ కూడా హైలెట్ కాబోతున్నట్లుగా అర్థమవుతుంది. ముఖ్యంగా డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. చూస్తుంటే ఈసారి నితిన మంచి సక్సెస్ అందుకునేలా ఉన్నాడు అని అనిపిస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.