అర్చరీలో నితిన్ 15 రోజులు ట్రైనింగ్!
యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'తమ్ముడు' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 July 2025 1:04 PM ISTయూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'తమ్ముడు' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. వరుస ప్లాప్ ల్లో ఉన్న నితిన్ తమ్ముడుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమా తో హిట్ అందుకుని ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఇందులో నితిన్ అర్చరీ ఆటగాడిగా కనిపించనున్నాడు. సాధారణంగా ఇలాంటి ఆటలను ఏ దర్శకుడు హీరోల పాత్రలకు తీసుకోరు.
ఎందుకంటే ఇవేమి పాపులర్ గేమ్స్ కాదు. కానీ వేణు శ్రీరామ్ అందుకు భిన్నంగా అర్చరీ ఆటగాడి తెరపై ఆవిష్కరిస్తున్నారు. మరి ఆ సంగతేంటో తేలాంటి దర్శకుడు చెప్పిన సంగతుల్లోకి వెళ్లాల్సిందే. విలువిద్య చాలా పురాతనమైనది. అందుకే అర్చరీని ఏదైనా కథలో ఇమడ్చాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. ఇది తమ్ముడుతో సరిగ్గా కుదిరింది. మిగతా ఆటలకంటే అర్చరీకి శారీరకంగా, మానసికంగా చాలా బలంగా ఎంతో ఏకాగ్రతతో ఉండాలి.
గాలి వచ్చే దిశను, వేగాన్ని కూడా అంచనా వేయగలగాలి. అందుకే ఈ సినిమా కోసం నితిన్ కు 15 రోజుల పాటు అర్చరీ పై స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించా. అడవిలో షూటింగ్ చేసినప్పుడు చాలా మంది గాయాల య్యాయి. రోడ్లు సరిగ్గా లేక..వాహనాలు లొకేషన్ వరకూ వెళ్లకపోవడంతో అడవిలోనే బాట సారులుగా మారాం. కానీ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం.
విక్రమ్ కమల్ హాసన్ పాత్ర కథలో ఎలా ప్రయాణిస్తుందో ఇదీ అదే పంథాలో ఉంటుంది. కథకు అనుగుణంగానే తమ్ముడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసాం. ఇదేదో పవన్ కళ్యాణ్ టైటిల్ అని పెట్టలేదు. అక్కా-తమ్ముడు కథ కావడంతోనే టైటిల్ వచ్చింది. అంతకు మించి మరే కారణాలు లేవు అని అన్నారు.
