Begin typing your search above and press return to search.

తమ్ముడు ఆ విషయంలో కూడా వేరే లెవెల్ ప్లాన్..!

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తమ్ముడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది.

By:  Tupaki Desk   |   12 May 2025 4:44 AM
Nithiin Thammudu  with Ajaneesh Loknath Magical
X

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తమ్ముడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో సిస్టర్ రోల్ లో ఒకప్పటి హీరోయిన్ లయ నటిస్తుంది. నితిన్ లయ కాంబినేషన్ సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు. తమ్ముడు ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్ కూడా అదరగొడతాడని అంటున్నారు.

దిల్ రాజు కాంపౌండ్ లో ఆస్థాన డైరెక్టర్ గా ఉన్నాడు వేణు శ్రీరామ్. అతని సినిమాలు మినిమం గ్యారెంటీ అవుతున్నాయి. అందుకే తమ్ముడు సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఐతే తమ్ముడు సినిమా విషయంలో మరో స్పెషల్ థింగ్ క్రేజీగా మారింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అజనీష్ లోక్ నాథ్ పనిచేస్తున్నాడు. కాంతారా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అజనీష్ తెలుగులో మంగళవారం సినిమా చేశాడు.

ఈమధ్యనే వచ్చిన ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలకు కూడా అతనే మ్యూజిక్ అందించాడు. ఐతే అజనీష్ మ్యూజిక్ అంటే అది రెగ్యులర్ కి భిన్నంగా ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. తమ్ముడు సినిమాకు అతన్ని ఏరి కోరి కావాలని తీసుకున్నారట. అజనీష్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందని తెలుస్తుంది. తమ్ముడు సినిమా ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ థియేటర్ లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయని అంటున్నారు.

సినిమాకు అజనీష్ మ్యూజిక్ మరో అట్రాక్షన్ అవుతుందట. రీసెంట్ గా రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఆ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. ఐతే తమ్ముడు సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తమ్ముడు తర్వాత వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ సినిమా చేయనున్నాడు నితిన్. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రాబోతుంది. ఐతే తమ్ముడు, ఎల్లమ్మ రెండు ప్రాజెక్ట్ లు దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలే అవ్వడం విశేషం. హీరో నితిన్ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఐతే భీష్మ తో సక్సెస్ అందుకున్న నితిన్ మరో హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఐతే తమ్ముడు, ఎల్లమ్మ రెండు సినిమాలైతే కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యేలా ఉన్నాయని తెలుస్తుంది.