నితిన్ తమ్ముడుతో ఆ ఫీట్ సాధిస్తాడా..?
లవర్ బోయ్ నితిన్ రాబిన్ హుడ్ తో సక్సెస్ కొడతాడని అనుకోగా అది కాస్త నిరాశపరిచింది.
By: Tupaki Desk | 4 Jun 2025 5:00 AM ISTలవర్ బోయ్ నితిన్ రాబిన్ హుడ్ తో సక్సెస్ కొడతాడని అనుకోగా అది కాస్త నిరాశపరిచింది. నెక్స్ట్ రాబోతున్న తమ్ముడు సినిమా మీద భారం పడింది. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తమ్ముడు. సినిమాలో నిన్నటి తరం హీరోయిన్ లయ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. నితిన్ సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.
టైటిల్ లోనే సినిమా కథ ఎలా ఉండబోతుందని తెలుస్తుండగా ఈసారి నితిన్ నుంచి రాబోతున్న ఈ యాక్షన్ మూవీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. నితిన్ తమ్ముడు సినిమాతో కెరీర్ లో మొదటిసారి 100 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఈమధ్య బడ్జెట్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ కి నచ్చితే చాలు ఆ సినిమాను 100 కోట్ల క్లబ్ లో ఉండేలా చేస్తున్నారు ప్రేక్షకులు.
నితిన్ తమ్ముడు సినిమాను ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ ప్లానింగ్ కూడా చేయబోతున్నారట. నితిన్ ఈమధ్య అసలేమాత్రం ఫాం లో లేకపోయినా తమ్ముడు మాత్రం కచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుందని చెబుతున్నారు. సినిమాలో ఎమోషన్, యాక్షన్ ఆడియన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయని అంటున్నారు. ఐతే త్వరలో సినిమా నుంచి టీజర్ రాబోతుందని తెలుస్తుంది. ఆ టీజర్ తోనే తమ్ముడు మీద ఒక హైప్ తీసుకురావాలని చూస్తున్నారు.
నితిన్ తమ్ముడు సినిమా తర్వాత బలగం వేణుతో ఎల్లమ్మ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది. ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. తమ్ముడు సినిమా పూర్తి చేసి నితిన్ ఇక పూర్తిగా ఎల్లమ్మ కోసం టైం కేటాయించాలని చూస్తున్నాడు. తమ్ముడు తో హిట్ టాక్ ఎక్కాలని చూస్తున్న నితిన్ ఆ నెక్స్ట్ రాబోతున్న ఎల్లమ్మ తో కూడా భారీ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. నితిన్ తమ్ముడు, ఎల్లమ్మ రెండు సినిమాలు కూడా దిల్ రాజు నిర్మాణంలోనే వస్తున్నాయి. దిల్ రాజు ఈ రెండు సినిమాల విషయంలో స్పెషల్ ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది.
