78 రోజులు నితిన్ వనవాసం!
తన టీమ్ తో పాటు తాను కూడా స్పాట్ లో ఉండటంతో రకరకాల అనుభవాలు ఎదురయ్యాయన్నాడు.
By: Tupaki Desk | 21 Jun 2025 7:00 PM ISTయూత్ స్టార్ నితిన్ కు సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. సక్సెస్ కోసం శ్రమిస్తున్నా ఫలితం దక్క లేదు. చేస్తోన్న ప్రయత్నాలేవి కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఆశలన్నీ 'తమ్ముడు' చిత్రంపైనే ఉన్నా యి. ఈ సినిమాతో హిట్ అందుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శ కత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ గా వేణుకు మంచి పేరుంది. కానీ కమర్శియల్ గా ఇంకా నిలదొ క్కుకోలేదు.
ఇంత వరకూ అతడి కెరీర్ లో 100 కోట్లు వసూళ్లు సాధించిన సినిమా ఒక్కటీ లేదు. 'తమ్ముడు'తో ఆ ఫీట్ సాధిస్తాడేమో చూడాలి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జులై 4న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. తాజాగా ఓ మీట్ లో నితిన్ అన్ సెట్స్ అనుభవాలు పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 78 రోజుల పాటు అడవిలోనే ఉన్నట్లు తెలిపాడు.
తన టీమ్ తో పాటు తాను కూడా స్పాట్ లో ఉండటంతో రకరకాల అనుభవాలు ఎదురయ్యాయన్నాడు. ఇంత వరకూ నితిన్ ఏ సినిమా కోసం అడవిలో షూటింగ్ చేయలేదు. కెరీర్ ఆరంభంలో 'జయం' సినిమా లో కొన్ని సన్నివేశాలు అటవీ సమీప ప్రాంతాల్లో షూట్ చేసారు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలకు పనిచేసాడు. కానీ నెల రోజులకు మించి ఏ సినిమా కోసం అడవిలో లేడు. తొలిసారి తమ్ముడు సినిమా సన్నివేశాలు డిమాండ్ చేయడంతో అడవి బాట పట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి నితిన్ చేతుల్లో ఉన్న ఒక్క చిత్రం ఇదే. కొత్త సినిమాలు వేటికి కమిట్ అవ్వలేదు. కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో స్టోరీల విషయంలో మరింత సెలక్టివ్ గా ఉంటున్నాడు. ప్రస్తుతానికి తమ్ముడుతో ఇదే ఏడాది ఖుషీ చేస్తాడు. మరి 2026 అప్ డేట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.
