Begin typing your search above and press return to search.

తమ్ముడు క్లైమాక్స్ వేరే లెవెల్ అటగా..?

`రాబిన్‌హుడ్‌` త‌రువాత నితిన్‌న‌టిస్తున్న ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా `త‌మ్ముడు`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   18 April 2025 7:15 PM IST
Thammudu Climax Scene
X

నితిన్ స‌క్సెస్ కోసం బాక్సాఫీస్‌పై దండ‌యాత్ర చేస్తున్నాడు. `భీష్మ‌` త‌రువాత హిట్టు మాట విని దాదాపు ఐదేళ్లు కావ‌స్తోంది. రీసెంట్‌గా చేసిన `రాబిన్ హుడ్‌` కూడా నితిన్ కోరిక‌ను తీర్చ‌లేక‌పోయింది. ఫ‌స్ట్ హాఫ్ జెంటిల్‌మెన్ త‌ర‌హాలో చాలా ఇంటెన్సీవ్‌గా తెర‌కెక్కించిన వెంకీ కుడుముల సెకండ్ పార్ట్ కొచ్చేస‌రికి క‌థ‌ను న‌డిపించే విష‌యంలో చేతులెత్తేశాడు. దీంతో స‌గం వండిన వంట మారి `రాబిన్ హుడ్‌` నితిన్‌కు షాక్ ఇచ్చింది. దీంతో త‌న ఆశ‌ల‌న్నీ `త‌మ్ముడు` మూవీపై పెట్టుకున్నాడు.

`రాబిన్‌హుడ్‌` త‌రువాత నితిన్‌న‌టిస్తున్న ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా `త‌మ్ముడు`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. త‌మ బ్యాన‌ర్‌లో నితిన్‌కు `శ్రీ‌నివాస క‌ల్యాణం` పేరుతో భారీ ఫ్లాప్‌ని ఇచ్చామ‌ని, ఈ మూవీతో సూప‌ర్ హిట్‌ని అందించాల‌నే ప‌ట్టుద‌ల‌తో దిల్ రాజు `త‌మ్ముడు` మూవీని నిర్మిస్తున్నారు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ హిట్ టైటిల్ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌ని నితిన్ ప్ర‌త్యేకంగా భావిస్తున్నాడ‌ట‌.

`వ‌కీల్ సాబ్‌` త‌రువాత కొంత విరామం తీసుకున్న వేణు శ్రీ‌రామ్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీ ద్వారా హీరోయిన్ ల‌య చాలా కాలం త‌రువాత రీఎంట్రీ ఇవ్వ‌బోతోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరిన ఈ మూవీని మే 9న భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స‌ప్త‌మిగౌడ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా అక్కా, త‌మ్ముళ్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో ఓ ఆట ప్ర‌ధానంశంగా సాగ‌నున్న ఈ సినిమాలోని క్లైమాక్స్ సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలవ‌నుంద‌ని తెలుస్తోంది.

క్లైమాక్స్ వేరే లెవెల్‌లో ఉంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. యాక్ష‌న్‌, సెంటిమెంట్ అంశాల మేళ‌వింపుతో

ఆగే ఈ సినిమాకు `కాంతార‌` ఫేమ్ అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. స‌మీర్‌రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ మూవీ కోసం వైజాగ్‌లో చిత్రీక‌రించిన ఛేజింగ్ స‌న్నివేశాలు కూడా హైలైట్‌గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. `భీష్మ‌` త‌రువాత ఆ స్థాయి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్‌ని `త‌మ్ముడు` మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకొస్తుందా అన్నది తెలియాలంటే మే సెకండ్ వీక్‌ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.