Begin typing your search above and press return to search.

ఒక మీడియం రేంజ్ హీరోకు వచ్చిన అతిపెద్ద లాస్‌!

నితిన్ కెరీర్ చూస్తే... విజయం కన్నా వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఎప్పటికప్పుడూ సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉంటాడు.

By:  Tupaki Desk   |   15 July 2025 10:48 AM IST
ఒక మీడియం రేంజ్ హీరోకు వచ్చిన అతిపెద్ద లాస్‌!
X

నితిన్ కెరీర్ చూస్తే... విజయం కన్నా వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఎప్పటికప్పుడూ సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉంటాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, భీష్మ వంటి సినిమాలతో హిట్ ట్రాక్‌లోకి వచ్చినా... తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ మరోసారి మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ, ఈ ఏడాది రెండు భారీ సినిమాలు తీసుకొచ్చాడు.

ఇవే రాబిన్ హుడ్, తమ్ముడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్ హుడ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అదే విధంగా వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు సినిమాపై కూడా మంచి హైప్ కనిపించింది. ఈ రెండు సినిమాలపై నితిన్, నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నా... బాక్సాఫీస్ దగ్గర మాత్రం తారుమారు అయ్యాయి.

రాబిన్ హుడ్ సినిమాను దాదాపు రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఫారిన్ షెడ్యూల్స్, టెక్నికల్ స్టాండర్డ్స్, హై లెవెల్ యాక్షన్ వల్ల ఖర్చు పెరిగింది. అదే విధంగా తమ్ముడు మూవీని దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ రెండు సినిమాల మీద కలిపి రూ.145 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కానీ రాబిన్ హుడ్ మూవీ టోటల్ రన్ లో రూ.7 కోట్ల లోపే షేర్‌ ను మాత్రమే సాధించగలిగిందని టాక్. రీసెంట్ గా రిలీజ్ అయిన తమ్ముడు మూవీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఓపెనింగ్‌లోనే నెగటివ్ టాక్ రావడంతో... ఇది కనీసం రూ.5 కోట్ల షేర్‌కూడా అందుకోవడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు సినిమాలు కలిపి కూడా రూ.11 కోట్ల రికవరీ మాత్రమే సాధించాయని టాక్ వినిపిస్తోంది.

దీంతో మొత్తం రూ.145 కోట్ల బడ్జెట్ మీద నితిన్ సినిమాలకు దాదాపు చాలా నష్టం వచ్చిందన్న అంచనా వినిపిస్తోంది. ఇది నితిన్ కెరీర్‌లోనే కాకుండా, ఒక మీడియం రేంజ్ హీరోకు వచ్చిన అతిపెద్ద లాస్‌గా అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ వర్గాలు. రెండు సినిమాలూ హైపుతో వచ్చినప్పటికీ కంటెంట్ లేకపోవడం, స్క్రీన్ ప్లే బలహీనత కారణంగా డిజాస్టర్‌ అయ్యాయి.

ఇకపై నితిన్ సేఫ్ ప్లే చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశ్రమ వర్గాలు. వరుసగా ఈ రేంజ్ డిజాస్టర్‌లు ఎదురైన తర్వాత నితిన్ తన కథల ఎంపిక పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మార్కెట్ పై ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం నితిన్ ఎల్లమ్మ లైనప్ లో ఉంది. ఆ సినిమా బడ్జెట్ విషయంలో దిల్ రాజు కాస్త సేఫ్ లో చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.