యూత్ స్టార్ సైతం ప్రయోగాల బాటలోనా!
యూత్ స్టార్ నితిన్ వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. `భీష్మ`తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చినా? ఆ సక్సెస్ ని కంటున్యూ చేయలేకపోయాడు.
By: Tupaki Desk | 4 Aug 2025 7:00 PM ISTయూత్ స్టార్ నితిన్ వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. 'భీష్మ'తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చినా? ఆ సక్సెస్ ని కంటున్యూ చేయలేకపోయాడు. ఏడు ప్లాప్ లతో మళ్లీ పాత పంథాలోకి వెళ్లాల్సిన నిశ్చత ఏర్పడింది. వరుస పరాజయా లతో మార్కెట్ లో ప్రతికూలత ఏర్పడింది. ఇప్పుడీ ఫేజ్ నుంచి నితిన్ వీలైనంత త్వరగా బయట పడాలి. లేదంటే? ప్రతికూలత పీక్స్ కు చేరుతుంది. ఇవన్నీ దగ్గరగానే గమనిస్తోన్న నితిన్ అందుకు తగ్గ ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు కనిపిస్తుంది. బ్యాకెండ్ లో నిర్మాత దిల్ రాజు కూడా కావాల్సిన సహాయం అంది స్తున్నా రు.
ఆయనెప్పుడూ సిద్దంగానే
తదుపరి ప్రాజెక్ట్ దిల్ రాజు బ్యానర్ లోనే లాక్ అయిన సంగతి తెలిసిందే. 'బలగం' ఫేం వేణు దర్శక త్వంలో `ఎల్లమ్మ` లాక్ చేసి పెట్టాడు. ఇప్పుడీ ప్రాజెక్ట్ పైనే నితిన్ సీరియస్ గా పని చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు కూడా నిర్మాత దిల్ రాజు భారీగానే బడ్జెట్ కేటాయించారు. నితిన్ మార్కెట్ తో సంబంధం లేకుండా తాను ఇవ్వాల్సిన క్వాలిటీ ప్రొడక్ట్ అందించడానికి రాజుగారు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఆ విషయంలో రాజీ పడే నిర్మాత కాదు.
నితిన్ కోసం రంగంలోకి
పైగా నితిన్ అంటే తాను కూడా అంతే బాధ్యతగా తీసుకుంటారు. గతంలో నితిన్ కెరీర్ కి 'దిల్' రూపంలో గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది కూడా రాజుగారే. ఆ తర్వాత `దిల్` అనేది రాజుగారి ఇంటిపేరుగా మారిపో యింది. మళ్లీ ప్లాప్ ల్లో ఉన్న నితిన్ ని సక్సెస్ బాట ఎక్కించాల్సిన బాధ్యత రాజుగారిపైనే ఉంది. ఈ సినిమా విషయంలో రాజుగారు ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నితిన్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓ లీక్ అందింది. సరిగ్గా ఇదే సమయంలో యూత్ స్టార్ మళ్లీ కోలీవుడ్ స్టార్ మేకర్ విక్రమ్. కె . కుమార్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలిసింది.
గుర్రపు స్వారీ వీరుడు గా
ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం ప్లాన్ చేస్తున్నారుట. ఇది క్రీడా నేపథ్యం గల చిత్రమని తెలిసింది. ఇందులో నితిన్ గుర్రపు స్వారీ వీరుడు పాత్రలో కనిపించనున్నాడుట. నితిన్ లుక్ కూడా కొత్తగా ఉండబోతుందని తెలిసింది. దీనిలో భాగంగా శరీరాకృతిలో భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ కి అధిక ప్రాధాన్యత ఉందిట. నితిన్-విక్రమ్ కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారుట.
హిట్ కాంబినేషన్
టాలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనుందని తెలిసింది. వచ్చే ఏడాది చివర్లో చిత్రం పట్టాలెక్కు తుందని సమాచారం. గతంలో ఇదే కాంబినేషన్ `ఇష్క్` హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ చేతులు కలపలేదు. మళ్లీ ఇప్పుడా సమయం ఆసన్న మైంది. మొత్తానికి నితిన్ ప్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాలతో అడుగులు వేయడం విశేషం.
