నితిన్ 'ఎల్లమ్మ'.. దిల్ రాజు ప్లాన్ ఇలా ఉందా?
అయితే ఇప్పుడు తన అప్ కమింగ్ చిత్రాలపై నితిన్ ఫోకస్ పెట్టారు.
By: Tupaki Desk | 14 July 2025 2:00 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కానీ సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు. భీష్మ మూవీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకోలేకపోయారు. 2025లో ఇప్పటికే రెండు సినిమాలతో థియేటర్స్ లో సందడి చేశారు నితిన్.
రాబిన్ హుడ్ మూవీతో మార్చిలో పలకరించిన నితిన్.. యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు ఆ సినిమా. ఆ తర్వాత రీసెంట్ గా తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఇప్పుడు తన అప్ కమింగ్ చిత్రాలపై నితిన్ ఫోకస్ పెట్టారు. బలగం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండితో ఎల్లమ్మ సినిమా చేయనున్న విషయం అందరికీ తెలిసిందే.
దిల్ రాజు నిర్మించనున్న ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో మేకర్స్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. అందుకు గాను లొకేషన్స్ ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తమ్ముడు మూవీ రిజల్ట్ ఎఫెక్ట్.. ఎల్లమ్మ మూవీపై పడిందని రీసెంట్ గా ప్రచారం జరిగింది.
బడ్జెట్ తగ్గించుకోవడానికి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్ వినిపించింది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాభాలను పంచుకునే పద్ధతిలో సినిమా తీయాలని దిల్ రాజు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఇప్పటికే నితిన్ కు కూడా ఇటీవల దిల్ రాజు చెప్పేశారని సమాచారం.
దీంతో సినిమాకు వచ్చే లాభాల్లో నితిన్ వాటా తీసుకుంటారు. ఏదేమైనా ఎల్లమ్మ మూవీని తక్కువ బడ్జెట్ తో నిర్మించేందుకు దిల్ రాజు సిద్ధమయ్యారని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ లో షూటింగ్ ను ప్రారంభించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఎల్లమ్మ మూవీతో అయినా నితిన్ హిట్ అందుకుంటారో లేదో వేచి చూడాలి.
