Begin typing your search above and press return to search.

జూన్ లో ముహూర్తం.. డిసెంబర్ రిలీజ్..?

సో మొత్తానికి బలగం తర్వాత వేణు మరో అద్భుతమైన కథతో రాబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ ఎల్లమ్మ అనుకున్న విధంగా డిసెంబర్ కల్లా పూర్తి చేస్తారా లేదా అన్నది చూడాలి.

By:  Tupaki Desk   |   17 May 2025 8:45 AM IST
జూన్ లో ముహూర్తం.. డిసెంబర్ రిలీజ్..?
X

నితిన్ రాబిన్ హుడ్ సినిమా షాక్ ఇవ్వడంతో నెక్స్ట్ తమ్ముడు సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. నితిన్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వస్తున్న తమ్ముడు సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందనిపిస్తుంది. ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ లయ నటించడం కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. తమ్ముడు తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఎల్లమ్మ. బలగం తర్వాత వేణు యెల్దండి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఆ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే ఈ సినిమాను నెక్స్ట్ మంత్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

బలగం కి తక్కువ బడ్జెట్ ఇచ్చినా మంచి ప్రొడక్ట్ తో సెన్సేషనల్ హిట్ అందించాడు డైరెక్టర్ వేణు. అందుకే ఈసారి ఎల్లమ్మ విషయంలో అతనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. నితిన్ సినిమా అంటే ఉండాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా చూస్తున్నారు. ఐతే ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ రోల్ కి ఆల్రెడీ హీరోయిన్ కీర్తి సురేష్ ని లాక్ చేశారని టాక్.

ఐతే వేణు ఈ సినిమాను ఇలా మొదలు పెట్టి అలా పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారట. జూన్ లో మొదలు పెట్టబోతున్న ఈ సినిమాను సరిగ్గా ఐదు నెలల్లో పూర్తి చేసి డిసెంబర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. బలగం తరహాలోనే ఎల్లమ్మ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని తెలుస్తుంది. గ్రామ దేవతకు సంబంధించిన ఎల్లమ్మ దేవత కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు వేణు.

బలగం తరహా ఎమోషన్స్ తో పాటు ఈసారి మన జీవితాల్లో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక విషయాలను కూడా ఈ సినిమాతో చెప్పనున్నారని తెలుస్తుంది. సో మొత్తానికి బలగం తర్వాత వేణు మరో అద్భుతమైన కథతో రాబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ ఎల్లమ్మ అనుకున్న విధంగా డిసెంబర్ కల్లా పూర్తి చేస్తారా లేదా అన్నది చూడాలి. దిల్ రాజు, నితిన్, వేణు ఈ కాంబోలో వస్తున్న ఎల్లమ్మ మరోసారి డైరెక్టర్ వేణు టాలెంట్ ని చూపించేలా చేస్తుందని అంటున్నారు. సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. వేణు మాత్రం బలగం కి ఎలాంటి కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లాడో ఎల్లమ్మకి అంతకు రెట్టింపు ఉత్సాహంతో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు.