ఇక తమ్ముడు ఏం చేస్తాడో మరి..?
తమ్ముడు టైటిల్ తోనే ఇది ఒక ఎమోషనల్ స్టోరీ అని చెబుతున్నా ఈ సినిమా కథ ఏంటన్నది ఇంకా క్లూస్ తెలియలేదు.
By: Tupaki Desk | 4 April 2025 8:00 AM ISTరెండు దశాబ్దాల కెరీర్ లో హిట్లు తక్కువ ఫ్లాపులు ఎక్కువ ఉన్నా కూడా ఇప్పటికీ విక్రమార్కుడిగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎన్ని ఫ్లాపులు వచ్చిన మళ్లీ సరికొత్త ఉత్సాహంతో వస్తుంటాడు. నితిన్ రీసెంట్ గా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదీగాక భీష్మతో ఈ ఇద్దరు కలిసి ఆల్రెడీ ఒక హిట్ సినిమా ఇచ్చారు. అందుకే రాబిన్ హుడ్ రిజల్ట్ పై అంచనాలు ఉన్నాయి.
కానీ సినిమా వచ్చాక అసలు లెక్క తేలిసింది. ఐతే రాబిన్ హుడ్ రిజల్ట్ తెలిసింది కాబట్టి ఇక నితిన్ నెక్స్ట్ రాబోతున్న సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాడు. నితిన్ తర్వాత సినిమా దిల్ రాజు బ్యానర్ లో వస్తుంది. దిల్ రాజు దగ్గర అస్థాన దర్శకుడైన వేణు శ్రీరామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాపై నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
తమ్ముడు టైటిల్ తోనే ఇది ఒక ఎమోషనల్ స్టోరీ అని చెబుతున్నా ఈ సినిమా కథ ఏంటన్నది ఇంకా క్లూస్ తెలియలేదు. ఐతే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నటిస్తుంది. ఆమె సిస్టర్ రోల్ లో అదరగొట్టబోతుంది. నితిన్, లయ మధ్య సీన్స్ ఆడియన్స్ కి ఎమోషనల్ టచ్ ఇస్తాయని అంటున్నారు. ఐతే రాబిన్ హుడ్ అంచనాలు తప్పింది కాబట్టి ఇక నితిన్ ఆశలన్నీ తమ్ముడు మీద పెట్టుకున్నాడు. దిల్ రాజు సినిమా కాబట్టి అది కూడా రాబిన్ హుడ్ సినిమా తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఆయన సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడని చెప్పొచ్చు.
తమ్ముడు తర్వాత వేణు శ్రీరాం డైరెక్షన్ లో నితిన్ ఎల్లమ్మ రాబోతుంది. ఆ సినిమా నెక్స్ట్ మంత్ సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్. అందుకే నితిన్ రాబోతున్న రెండు సినిమాల మీద చాలా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. తమ్ముడు సినిమా నితిన్ కెరీర్ లోనే స్పెషల్ మూవీ అని చెప్పుకుంటున్నారు మరి రాబిన్ హుడ్ ఇంపాక్ట్ పడకుండా ఆ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. నితిన్ కూడా రాబోతున్న సినిమాల గురించి ఇంకాస్త జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది.
