హీరోగానే కాదు నిర్మాతగా కూడా లాసేనా..?
హీరో నితిన్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. చేస్తున్న సినిమాలేవి వర్క్ అవుట్ కాకపోగా అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 14 July 2025 10:30 PM ISTహీరో నితిన్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. చేస్తున్న సినిమాలేవి వర్క్ అవుట్ కాకపోగా అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అన్న విషయం తెలిసిందే. నితిన్ కి ఎన్ని ఫ్లాపులు పడినా కూడా మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి మెయిన్ రీజన్ ఆయనే.
నితిన్ చేస్తున్న సినిమాలు ఎన్ని ఫ్లాపులు వచ్చినా మళ్లీ అతనికి మరో సినిమా అవకాశం వస్తుంది. దీని వెనక ఉన్న సుధాకర్ రెడ్డి ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక నితిన్ కు దిల్ రాజు కూడా మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తాడు. వాళ్ల మధ్య ప్రొడ్యూసర్, హీరో రిలేషన్ కన్నా రిలేషన్ కూడా ఉంది.
ఇక హీరోగా నితిన్ ఫెయిల్యూర్ ఎలా ఉన్నా మళ్లీ సినిమాలు చేస్తాడు. ఐతే నిర్మాతగా కూడా నితిన్ ఫెయిల్ అవుతున్నాడు. కమల్ హాసన్ విక్రం సినిమాను తెలుగు రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్న నితిన్ అండ్ టీం ఆ తర్వాత చాలా సినిమాలను రిలీజ్ చేశారు కానీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే విక్రం ఇచ్చిన జోష్ తో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాను కూడా భారీ ధరకు కొనేశారు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి.
కానీ ఆ సినిమా కూడా నిరాశపరచింది. మణిరత్నం, కమల్ దాదాపు 3 దశాబ్ధాల తర్వాత తీసిన సినిమా అయినా కూడా అది వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈ సినిమా వల్ల నితిన్ ఫాదర్ భారీ లాసులు ఫేస్ చేశాడు. ఓ పక్క నితిన్ కూడా ఫ్లాపుల్లో ఉండటం కూడా మైనస్ అవుతుంది. మరి హీరోగా, నిర్మాతగా నితిన్ వరుస సక్సెస్ లు అందుకోవాలంటే కాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది.
రీసెంట్ గా తమ్ముడు సినిమాతో మరోసారి నిరాశపరచిన నితిన్ నెక్స్ట్ ఎల్లమ్మతో రాబోతున్నాడు. మరి ఆ సినిమా అయినా నితిన్ ని మళ్లీ హిట్ ట్రాక్ లోకి తెస్తుందా లేదా అన్నది చూడాలి. ఎల్లమ్మ తర్వాత నితిన్ ఇష్క్ డైరెక్టర్ విక్రం కె కుమార్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. నితిన్ విక్రమార్క దండయాత్ర ఇంకా ఎన్నాళ్లు చేస్తాడు.. అతనికి సక్సెస్ ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి.
