18 ఏళ్ల వయసులోనే ముద్దుగుమ్మ 'పెద్ద' పాత్రలు..!
ఇటీవల ఈమె బాలీవుడ్ సీనియర్ స్టార్ సన్నీ డియోల్ నటించేందుకు ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 22 Aug 2025 2:00 PM ISTబుల్లి తెరపై బాల నటిగా పలు సీరియల్స్‌లో నటించిన నితాన్షి గోయెల్ మంచి గుర్తింపు దక్కించుకుంది. చిన్నప్పటి నుంచి నటిగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న నితాన్షి ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది ఈమె నటించిన 'లపాటా లేడీస్' సినిమా వచ్చింది. ఆ సినిమా పై మొదట పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే ప్రేక్షకుల ముందుకు వచ్చిందో, ఆస్కార్ వరకు జర్నీ సాంగించిందో అప్పటి నుంచి సినిమా గురించి ప్రముఖంగా మాట్లాడుకోవడం మొదలు అయింది. సినిమా గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో అందులో నటించిన నితాన్షి గోయెల్ గురించి కూడా జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. తక్కువ సమయంలోనే దేశం మొత్తం నితాన్షి కి మంచి ఫాలోయింగ్, గుర్తింపు, గౌరవం దక్కింది అనడంలో సందేహం లేదు.
లపాటా లేడీస్ ముద్దుగుమ్మ నితాన్షి గోయెల్
అమీర్ ఖాన్ నిర్మించిన లపాటా లేడీస్ సినిమాలో ఫూల్ కుమారి పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సీరియల్‌లో కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు ఇంత పెద్దగా అయిందా అని చాలా మంది షాక్ అయ్యారు. మొత్తానికి లపాటా లేడీస్ కారణంగా ఒక్కసారిగా ఈ అమ్మడికి స్టార్‌డం దక్కింది. ఆ స్టార్‌డం కారణంగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. మైదాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైదాన్ సినిమాలో ఈమె చేసిన పాత్రకు సైతం ప్రశంసలు దక్కాయి. పాత్ర ఏదైనా నటిగా తన పూర్తి ఎఫర్ట్ పెట్టడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న ముద్దుగుమ్మ ఫూల్ కుమారి తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ, బిజీ స్టార్‌గా దూసుకు పోతుంది. ఒక వైపు వెబ్ సిరీస్, మరో వైపు సినిమాల నుంచి ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నట్లుగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
ఆస్కార్ వరకు వెళ్లిన లపాటా లేడీస్
ఇటీవల ఈమె బాలీవుడ్ సీనియర్ స్టార్ సన్నీ డియోల్ నటించేందుకు ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. సిద్దార్థ్ పి మల్హోత్ర దర్శకత్వంలో రూపొందబోతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో సన్నీ డియోల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో సన్నీ డియోల్ వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఆయన పనైపోయింది అనుకుంటున్న సమయంలో లక్కీగా గదర్ 2 సినిమాతో ఒక్కసారిగా రీ ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. ఆ సినిమా సూపర్ హిట్ సాధించడం మాత్రమే కాకుండా వందల కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అందుకే సన్నీ డియోల్ తో సినిమాలకు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు, ఫిల్మ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఆయన సైతం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు.
సన్నీడియోల్ సినిమాలో నితాన్షి
సన్నీడియోల్, సిద్దార్థ్ పి మల్హోత్ర కాంబోలో రూపొందబోతున్న సినిమాలో నితాన్షి గోయెల్ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. సినిమాలో నితాన్షి పాత్ర ఏమై ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వికీపీడియా అనుసారం నితాన్షి గోయెల్ వయసు 18 ఏళ్లు మాత్రమే. కనుక ఆమె ఈ వయసులో సన్నీడియోల్ సినిమాలో నటించడం అంటే ఖచ్చితంగా చాలా పెద్ద పాత్రను చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తుందా లేదంటే కాస్త ఎక్కువ వయసు అమ్మాయి లేదా ఆంటీ పాత్రలో నితాన్షి కనిపిస్తుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రకరకాల పుకార్లు వస్తున్నాయి. వాటన్నింటికి త్వరలోనే దర్శకుడు సిద్దార్థ్ పి మల్హోత్ర క్లారిటీ ఇస్తాడా అనేది చూడాలి.
