Begin typing your search above and press return to search.

హనుమాన్ మేకర్స్ కొత్త మూవీ.. క్రేజీ స్టోరీతో!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   19 April 2024 8:27 AM GMT
హనుమాన్ మేకర్స్ కొత్త మూవీ.. క్రేజీ స్టోరీతో!
X

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో అనేక రికార్డులు బద్దలుకొట్టింది. ఈ సినిమాతో నిర్మాత నిరంజన్ రెడ్డి మంచి లాభాలు అందుకున్నారు. తమ బ్యానర్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పై చేసిన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు.

దీంతో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే కొత్త సినిమాలపై అందరి దృష్టి పడింది. ఈ బ్యానర్ నుంచి వచ్చే నెక్స్ట్ చిత్రం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను నిరంజన్ రెడ్డినే నిర్మించనున్నారు. అంతకన్నా ముందు.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ లేటెస్ట్ గా వచ్చింది.

రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ సర్టిఫికెట్ పై కొత్త జంట సంతకం చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. భర్త పేరు రాఘవ్ అని, భార్య పేరు ఆనంది అని రాసి ఉంది. ఏప్రిల్ 20వ తేదీన 12.33 PM నుంచి సర్టిఫికెట్ అమల్లోకి వస్తున్నట్లు ఉంది. ఈ క్రేజీ ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్.. సినిమాపై ఆసక్తి పెంచుతోంది. రేపు మధ్యాహ్నం 12.33 గంటలకు మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. హనుమాన్ తర్వాత ప్రైమ్ షో బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయింది.

అయితే ఈ సినిమాలో బలగం మూవీతో హీరోగా మారిన కమెడియన్ ప్రియదర్శి, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పై ఉందని, షూటింగ్ శరవేగంగా సాగుతోందని సమాచారం. అవుట్ అండ్ అవుట్ క్రేజీ కామెడీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అప్డేటే రేపు రానుందని తెలుస్తోంది.

ఇక ఈ మూవీ తర్వాత.. నిరంజన్ రెడ్డి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేయనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో కూడా మూవీ ఫిక్స్ చేసుకున్నట్లు వినికిడి. అలా హనుమాన్ సినిమా ఇచ్చిన జోష్ తో ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. మరి హనుమాన్ మేకర్స్ నిర్మించే కొత్త సినిమాలు ఎలాంటి హిట్లు కొడతాయో చూడాలి.