Begin typing your search above and press return to search.

16 సినిమాల్లో 7 హిట్లు.. మెగా మేనల్లుడి 9 ఏళ్ల సినీ ప్రయాణం..!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నేటితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 10:53 AM GMT
16 సినిమాల్లో 7 హిట్లు.. మెగా మేనల్లుడి 9 ఏళ్ల సినీ ప్రయాణం..!
X

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నేటితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వైవిఎస్ చౌదరి రేయ్ సినిమా ముందు మొదలైనా ఏ.ఎస్ రవి కుమార్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ముందు రిలీజైంది. ఆ సినిమాలో సాయి తేజ్ ఎనర్జీకి మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. మెగా మేనల్లుడా మజాకానా అంటూ మెగా ఫ్యామిలీలో మరో హీరో స్టార్ క్రేజ్ దక్కించుకోవడం పక్కా అని ఫిక్స్ అయ్యారు.


పిల్లా నువ్వులేని జీవితం హిట్ కాగా రేయ్ నిరాశ పరిచింది. ఆ తర్వాత వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సే, సుప్రీం రెండు సినిమాలు సాయి తేజ్ ఖాతాలో హిట్ అందించాయి. ఆ తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ అంటూ 3 ఏళ్లు 6 సినిమాలు వరుస ఫ్లాపులు అందుకున్నాడు. తేజ్ ట్రాక్ తప్పాడు అనుకున్న టైం లో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వచ్చిన చిత్రలహరి అతనికి మళ్లీ ట్రాక్ ఎక్కించింది. ఆ సినిమా తర్వాత వెంటనే మారుతి డైరెక్షన్ లో వచ్చిన ప్రతి రోజు పండుగే సినిమా తేజ్ కి మరో హిట్ అందించింది.

బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఇక తేజ్ కి తిరుగులేదు అనుకునే టైం లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజై ఫ్లాపైంది. కోవిడ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు జనాలు వస్తారో రారో అన్న టైం లో రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. ఇక ఆ తర్వాత దేవా కట్ట డైరెక్షన్ లో రిపబ్లిక్ సినిమా చేశాడు. ఆ సినిమా రిలీజ్ టైం లో మేజర్ బైక్ యాక్సిడెంట్ తో కోమాలోకి వెళ్లాడు సాయి తేజ్.

కేబుల్ బ్రిడ్జి మీద సాయి తేజ్ కి జరిగిన యాక్సిడెంట్ వల్ల దాదాపు 3 నెలల పాటు కోమాలోనే ఉన్నాడు. 2021 లో యాక్సిడెంట్ కాగా రెండేళ్లు టైం తీసుకున్న సాయి తేజ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తో హిట్ అందుకోగా ఈ ఇయర్ మేనమామ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాతో వచ్చాడు. బ్రో కూడా ప్రేక్షకులను మెప్పించింది.

ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ సినిమా చేస్తున్నాడు సాయి తేజ్. కెరీర్ అంతా సాఫీగా సాగుతుంది అనుకునే టైం లో బైక్ యాక్సిడెంట్ సాయి తేఏజ్ కెరీర్ మళ్లీ మొదటికి తెచ్చింది. ఆ యాక్సిడెంట్ తర్వాత ఒకప్పటిలా సాయి ధరం తేజ్ మాట్లాడటం కష్టం అవుతుంది. అయితే చిన్నగా తనను తాను షైన్ చేసుకుంటూ మళ్లీ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. 9 ఏళ్ల ఈ సినీ ప్రయాణంలో మెగా మేనల్లుడు సాయి తేజ్ మెగా ఫ్యాన్స్ నే కాదు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించడం లో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.