కశ్మీర్‌లో నాన్నను కిడ్నాప్ చేసి చంపారు.. నటి ఆవేదన!
అయితే నిమ్రత్ జీవితంలో ఒక మర్చిపోలేని విషాదం ఉంది. 1994లో కాశ్మీర్‌లో జరిగిన అపహరణ, హత్యతో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతుడైన సైనిక అధికారి దివంగత మేజర్ భూపేంద్ర సింగ్ తన తండ్రి.
By: Tupaki Desk | 12 May 2025 4:45 AMనటి నిమ్రత్ కౌర్ పేరు ఇటీవల ఎక్కువగా మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఐశ్వర్యారాయ్ భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ తో ఎఫైర్ సాగిస్తోందనే ప్రచారం నడుమ నిమ్రత్ పేరు బాగా పాపులరైంది. అదంతా అటుంచితే, ఇటీవల కొన్ని సినిమాలలో పవర్ ప్యాక్డ్స్ పెర్ఫామెన్సెస్ తో నిమ్రత్ మంచి పేరు తెచ్చుకుంది. ది లంచ్‌బాక్స్, ఎయిర్‌లిఫ్ట్, దాస్వి చిత్రాలలో తన పాత్రలలో అద్భుత నటనతో ప్రశంసలు పొందింది.
అయితే నిమ్రత్ జీవితంలో ఒక మర్చిపోలేని విషాదం ఉంది. 1994లో కాశ్మీర్‌లో జరిగిన అపహరణ, హత్యతో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతుడైన సైనిక అధికారి దివంగత మేజర్ భూపేంద్ర సింగ్ తన తండ్రి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇటీవల జాతీయ భద్రత, ఉగ్రవాదం గురించి చర్చ జరుగుతుండగా, నిమ్రత్ కౌర్ నాటి బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. నిమ్రత్ ఒక పాత ఇంటర్వ్యూలో మేజర్ సింగ్ కాశ్మీర్ సరిహద్దు రోడ్ నెట్‌వర్క్‌లో ఉన్న వెరినాగ్‌లో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో కాశ్మీర్‌ను ఫ్యామిలీ స్టేషన్‌గా అతడికి విధులు కేటాయించగా, జనవరి 1994లో నిమ్రత్ కౌర్ తన కుటుంబం శీతాకాల సెలవుల్లో మేజర్ సింగ్ వద్దకు వెళ్లారు. అయితే హిజ్బుల్-ముజాహిదీన్ ఉగ్రవాదులు విధుల్లో ఉన్న అతడిని అపహరించారు. ఏడు రోజుల వేధింపులకు గురి చేసిన తర్వాత అతడు హత్యకు గురయ్యారు. ఇది కౌర్ జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది.
ఉగ్రవాదులు అసమంజసమైన డిమాండ్లతో మేజర్ ని వేధించారు. మేజర్ సింగ్ చలించలేదు.. దేనికీ అంగీకరించలేదు. చివరికి వారి చేతుల్లో హతుడయ్యాడు. 44 వయసుకే ఈ మరణం. అతడి మరణం అనంతరం పాటియాలాలో నివసిస్తున్న కుటుంబం ఆయన మృతదేహంతో ఢిల్లీకి తిరిగి వెళ్లింది. ఆ తర్వాత ఇక కశ్మీర్ లోయకు తిరిగి రాకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే ది లంచ్ బాక్స్ సినిమా విడుదలైన అనంతరం నిమ్రత్ తన తండ్రిని అపహరించిన వెరినాగ్ ప్రదేశానికి వెళ్లింది. చివరిసారిగా తన తండ్రిని సజీవంగా చూసిన ప్రదేశంలో ఏదో ఒక రకమైన భావోద్వేగాన్ని కనుక్కునే ప్రయత్నం చేసింది. మేజర్ భూపేందర్ సింగ్‌కు మరణానంతరం భారతదేశపు అత్యున్నత సైనిక , పౌర పురస్కారాలలో ఒకటైన శౌర్య చక్రను ప్రదానం చేశారు. మార్చి 13, నిమ్రత్ కౌర్ పుట్టినరోజున ఈ గుర్తింపు లభించింది. తన తండ్రి దివంగత 72వ జయంతి సందర్భంగా నిమ్రత్ కౌర్, తన తల్లి సోదరితో కలిసి రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో మేజర్ భూపేందర్ సింగ్ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు.
నిమ్రత్ ఇటీవలే కుల్: ది లెగసీ ఆఫ్ ది రైజింగ్‌గ్స్‌లో నటించింది. ఇది జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెక్షన్ 84 లోను నిమ్రత్ నటిస్తోంది.