Begin typing your search above and press return to search.

బ్లాక్ ఇన్న‌ర్‌లో చిత‌క్కొట్టిన నిక్కీ తంబోలి

నిక్కీ తాజాగా సోష‌ల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. తంబోలి బ్లాక్ అండ్ బ్లాక్ ఇన్న‌ర్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది.

By:  Tupaki Desk   |   1 March 2024 12:32 PM GMT
బ్లాక్ ఇన్న‌ర్‌లో చిత‌క్కొట్టిన నిక్కీ తంబోలి
X

యువ‌క‌థానాయిక నిక్కీ తంబోలి సోష‌ల్ మీడియాల్లో సూప‌ర్ ఫేమ‌స్. ఈ బ్యూటీ ఇప్ప‌టికే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం. లారెన్స్ స‌ర‌స‌న కాంచ‌న 3లో తంబోలి న‌టించింది. ఆ త‌ర్వాత చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు స‌హా ప‌లు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుకుల‌కు సుప‌రిచితం. నిక్కి చివరిసారిగా బర్త్ డే పవ్రీ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు. బిగ్ బాస్ 14 టాప్ 3 ఫైనలిస్టులలో ఆమె ఒకరు. ఈ కార్యక్రమంలో రుబినా దిలైక్ విజేతగా నిల‌వ‌గా.. రాహుల్ వైద్య రన్నరప్ గా నిలిచారు. నిక్కీ షో స్టాప‌ర్ గా నిలిచింది.

నిక్కీ తాజాగా సోష‌ల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. తంబోలి బ్లాక్ అండ్ బ్లాక్ ఇన్న‌ర్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్యూర్ బ్లాక్ అండ‌ర్ వేర్.. బ్లాక్ టాప్ ధ‌రించిన నిక్కీ తంబోలి రెబ‌లియ‌న్ ఫోజులు వైర‌ల్ గా మారాయి. ''దయచేసి కూర్చోండి.... నేను వచ్చాను!'' అంటూ ఈ ఫోటోషూట్ కి అంద‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చింది తంబోలి.

ప్రేమ‌లో నిక్కీ?

నిక్కీ తంబోలి తన బాహాటంగా మాట్లాడే స్వభావం.. ఉల్లాసభ‌రిత‌మైన యాటిట్యూడ్ తో బిగ్ బాస్ షోలో పాపుల‌రైంది. నిక్కీ మ్యూజిక్ వీడియోలు..బిగ్ బాస్, ఖత్రోన్ కే ఖిలాడీ .. ఖత్రా ఖత్రా వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకుల హృద‌యాల‌ను గెలుచుకుంది. అభిమానులకు ఎప్పుడూ నిక్కీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాల‌నే ఆస‌క్తితో ఉంటారు. ఇంత‌కీ ఆమె ప్రేమ‌లో స‌క్సెసైందా? అంటూ ఆరాలు కొన‌సాగుతున్నాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా నిక్కీ తంబోలి తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచడాన్ని విజయవంతంగా మేనేజ్ చేయ‌గ‌లిగింది.

ప్రతీక్ సెహజ్‌పాల్ తో నిక్కీ ప్రేమ‌లో ఉంద‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. అయితే త‌ను ఈ ఊహాగానాలను ఎప్పుడూ ఖండించింది. తాము మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని పేర్కొంది. ఇటీవ‌ల త‌న లవ్ లైఫ్ గురించి ఎలాంటి స‌మాచారం లేదు.