Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : దుబాయ్ లో మన యంగ్ హీరోలు ఇలా..

తేజ సజ్జా, నిఖిల్ తో దిగిన పిక్స్ ను షేర్ చేశారు సందీప్. జస్ట్ స్మెల్స్ అంటూ దుబాయ్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం వీరు ముగ్గురూ దుబాయ్ లో ఫుల్ చిల్ అవుతున్నారన్న మాట.

By:  Tupaki Desk   |   14 March 2024 11:26 AM GMT
పిక్ టాక్ :  దుబాయ్ లో మన యంగ్ హీరోలు ఇలా..
X

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలు తమ చిత్రాలతో అలరిస్తున్నారు. స్పెషల్ కాన్సెప్టులతో వచ్చి హిట్లు కొడుతున్నారు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకెళ్తున్నారు. హార్డ్ వర్క్, టాలెంట్ తో సత్తా చాటుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సీనియర్లకు పోటీ కూడా ఇస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో మూవీని పట్టాలెక్కిస్తున్నారు. స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నారు.

2024లో జనవరిలో హనుమాన్ మూవీతో వచ్చి యంగ్ హీరో తేజ సజ్జా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయారు. ఇక ఫిబ్రవరిలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో సుహాస్, ఊరు పేరు భైరవ కోన మూవీతో సందీప్ కిషన్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా మరో యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. గామి మూవీతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తేజ సజ్జా, నిఖిల్ తో దిగిన పిక్స్ ను షేర్ చేశారు సందీప్. జస్ట్ స్మెల్స్ అంటూ దుబాయ్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం వీరు ముగ్గురూ దుబాయ్ లో ఫుల్ చిల్ అవుతున్నారన్న మాట. ముగ్గురు కలిసి దిగిన క్రేజీ సెల్ఫీ.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. నైస్ బ్రోస్.. ఎంజాయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. ముగ్గురు కూడా కొత్త చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ సజ్జా.. ప్రస్తుతం మిరాయ్ మూవీ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తేజ సజ్జా క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ లో మేకర్స్ మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరోవైపు, ఇటీవల ఫాదర్ గా ప్రమోషన్ కొట్టిన నిఖిల్.. స్వయంభు షూటింగ్ లో పాల్గొంటున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ.. 2024లోనే విడుదల కానుంది. ఇక సందీప్ కిషన్ లైనప్ సూపర్ గా ఉంది. మాయావన్ సీక్వెల్ షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ కుర్ర హీరో.. ఇటీవల ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో మరో సినిమా అనౌన్స్ చేశారు. మరి ఈ ముగ్గురు తమ కొత్త సినిమాలతో ఎలాంటి హిట్లు కొడతారో చూడాలి.