Begin typing your search above and press return to search.

డాడీ గా నిఖిల్ కి ప్ర‌మోష‌న్

ఇంత వ‌ర‌కూ ఈ విష‌యాన్ని నిఖిల్ ఎక్క‌డా రివీలే చేయ‌లేదు. నేరుగా సీమంతం ఫోటోల‌తోనే అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేయ‌డం విశేషం.

By:  Tupaki Desk   |   31 Jan 2024 6:28 PM GMT
డాడీ గా నిఖిల్ కి ప్ర‌మోష‌న్
X

యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఈ విష‌యాన్ని నిఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టిం చాడు. భార్య ప‌ల్ల‌వి సీమంతం ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి విష‌యాన్ని చెప్పాడు. 'మా మొద టి బిడ్డ అతి త్వ‌ర‌లోనే రాబోతుంది. ప‌ల్ల‌వి..నేను ఎంతో సంతోషంగా ఉన్నాం. మీ అంద‌రి దీవెన‌లు మాకు అవ‌స‌రం' అంటూ రాసుకొచ్చాడు. దీంతో నిఖిల్ దంప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతు న్న‌ట్లు తొలిసారి వెలువ‌డిన అధికారిక వార్త ఇది.

ఇంత వ‌ర‌కూ ఈ విష‌యాన్ని నిఖిల్ ఎక్క‌డా రివీలే చేయ‌లేదు. నేరుగా సీమంతం ఫోటోల‌తోనే అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేయ‌డం విశేషం. దీంతో ప్రేక్ష‌కాభిమానులు ఆ దంప‌తుల‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. భార్య‌తో క‌లిసి దిగిన ఫోటోను నిఖిల్ షేర్ చేసాడు. ఇక నిఖిల్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. 'కార్తికేయ‌-2' తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆ త‌ర్వాత పాన్ ఇండియా చిత్రాలు చేయ‌లేదు.

'18 పేజీస్'..'.స్పై' చిత్రాల్లో న‌టించాడు. అవి రీజ‌న‌ల్ మార్కెట్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేసాడు. ప్ర‌స్తుతం నిఖిల్ 'స్వ‌యంభు' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. స్వయంభు ప్రేక్షకుల్లోనే కాదు సెలబ్రెటీల్లో సైతం అమితాసక్తి క్రియేట్ చేసింది. ఇందులో నిఖిల్ యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే బోలెడంత బ‌జ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఆయన తమిళంలో పలు సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఈ సినిమాతో మెగాఫోన్ ప‌ట్ట‌డం విశేషం.ముందుగా ఈ కథను చోళుల నేపథ్యంలో రాసుకున్నాడట. అయితే ఇటీవలే వచ్చిన పొన్నియన్ సెల్వన్ కూడా చోళ సామ్రాజ్యం క‌థ కావ‌డంతో స్వ‌యంభు పై మ‌ళ్లీ రీ వర్క్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. 'బింబిసార' రచయిత వాసుదేవ్ సహకారంతో స్క్రిప్ట్ లో పలు మార్పులు చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. చోళ కాన్సెప్ట్ ని తొల‌గించి పూర్తిగా ఫిక్షనల్ స్టోరీగా మారుస్తున్న‌ట్లు సమాచారం. మ‌రి ఈ మార్పు వెనుక వాస్త‌వాలు తెలియాల్సి ఉంది.