Begin typing your search above and press return to search.

స్పై డిజాస్టర్ పై నిఖిల్ ఏమన్నారంటే..!

నిజానికి స్పై సినిమా ఇంకా 10 రోజులు షూటింగ్ పెండింగ్ ఉందని, అయితే నిర్మాత అది పూర్తి చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి హడావిడిగా రిలీజ్ చేసేసారని నిఖిల్ తెలిపారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:00 AM GMT
స్పై డిజాస్టర్ పై నిఖిల్ ఏమన్నారంటే..!
X

పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దిశగా దూసుకుపోతోన్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నిఖిల్. ప్రస్తుతం అతను చేస్తోన్న మూడు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే తెరకెక్కుతున్నాయి. వాటిలో స్వయంభు, ది ఇండియన్ హౌస్ ముందు వరుసలో ఉన్నాయి. వీటి తర్వాత కార్తికేయ 3ని కూడా పట్టాలు ఎక్కించబోతున్నారు.

అయితే కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాల సక్సెస్ తర్వాత నిఖిల్ స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన సబ్జెక్ట్ అనుకున్న విధంగా లేకపోవడంతో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. ఈ సినిమా ఫెయిల్యూర్ పై నిఖిల్ అప్పట్లోనే సారీ కూడా చెప్పారు.

తాజాగా మరోసారి స్పై సినిమా ఫెయిల్యూర్ పై నిఖిల్ స్పందించాడు. ఈ మూవీ డిజాస్టర్ కావడానికి కారణం చెప్పాడు. నిజానికి స్పై సినిమా ఇంకా 10 రోజులు షూటింగ్ పెండింగ్ ఉందని, అయితే నిర్మాత అది పూర్తి చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి హడావిడిగా రిలీజ్ చేసేసారని నిఖిల్ తెలిపారు. ఈ కారణంగానే మూవీ అసంపూర్ణంగా వచ్చి డిజాస్టర్ అయ్యిందని అన్నారు.

ఈ సినిమా విషయంలో చాలా పొరపాట్లు జరిగాయని, ఇకపై చేయబోయే మూవీస్ విషయంలో అలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతానని క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేస్తారో అంతకు మించి మంచి కథలని అందించే ప్రయత్నం చేస్తానని హాపీ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ లో ఉన్నాడు.

ఈ సినిమాలో కింగ్ పాత్రలో నిఖిల్ కనిపించనున్నాడు. హిస్టోరికల్ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ ఈ కథ ఉండబోతోంది. ఈ సినిమా కోసం నిఖిల్ మూడు నెలల పాటు ప్రత్యేకంగా యుద్ధవిద్యలలో శిక్షణ కూడా తీసుకోవడం విశేషం. అతని కెరియర్ లో ఫస్ట్ టైం కంప్లీట్ గా పీరియాడికల్ టచ్ లో ఒక యువరాజు పాత్రని నిఖిల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ అతనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.