Begin typing your search above and press return to search.

నిఖిల్ తో అత‌ను..రంగంలోకి గీతా ఆర్స్ట్!

యంగ్ హీరో నిఖిల్ ప్ర‌యోగాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కంటెంట్ ప్రాధాన్య‌మున్న చిత్రాల్లో న‌టిస్తూ స్టార్ డ‌మ్ ని రెట్టింపు చేసుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 7:10 AM GMT
నిఖిల్ తో అత‌ను..రంగంలోకి  గీతా ఆర్స్ట్!
X

యంగ్ హీరో నిఖిల్ ప్ర‌యోగాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కంటెంట్ ప్రాధాన్య‌మున్న చిత్రాల్లో న‌టిస్తూ స్టార్ డ‌మ్ ని రెట్టింపు చేసుకుంటున్నాడు. ఈ విష‌యంలో నిఖిల్ ఎంతో బ్రిలియంట్ గా ముందు కెళ్తున్నాడు. ప్ర‌స్తుతం `స్వ‌యంభూ` అనే పిరియాడిక్ చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భ‌ర‌త్ కృష్ణ‌మాచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఆ సినిమా సెట్స్ లో ఉంది. తాజాగా ఆ సినిమా ఆన్ సెట్స్ లో ఉండ‌గానే కొత్త ప్రాజెక్ట్ లు షురూ చేస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో వి. ఐ ఆనంద్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో `ఎక్క‌డిపోతావు చిన్న‌వాడే` అనే హార‌ర్ థ్రిల్ల‌ర్ తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో నిఖిల్ మ‌రోసారి ఆనంద్ తెర‌పైకి తెస్తున్నాడు. ఇప్ప‌టికే స్టోరీ డిస్క‌ష‌న్ కూడా పూర్త‌యింది. ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతా ఆర్స్ట్ నిర్మిస్తుంది. ఈ విష‌యాన్ని ఆనంద్ అధికారికంగా వెల్ల‌డించాడు.

ఆనంద్ త‌దుప‌రి నిఖిల్ సినిమాకే స‌న్న‌ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి గీతా ఆర్స్ట్ లో ఆనంద్ న‌లుగురు స్నేహితుల నేప‌థ్యంలో సినిమా చేయాల‌నుకున్నాడుట‌. కానీ వెన్నెల కిషోర్...రాహుల్ రామ‌కృష్ణ డేట్లు దొర‌క‌క‌పోవ‌డంతో ఆకాంబినేష‌న్ సెట్ అవ్వ‌లేదు. దీంతో స్టోరీ మార్చి అదే బ్యాన‌ర్ లో నిఖిల్ తో సినిమా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. గీతా ఆర్స్ట్ అనుబంధ సంస్థ జీఏ- 2 బ్యాన‌ర్లో నిఖిల్ ఇప్ప‌టికే `18 పేజీస్` అనే కంటెంట్ బేస్డ్ సినిమా చేసాడు. ఈ

సినిమా బాగానే ఆడింది. 18 కోట్ల‌తో నిర్మించిన సినిమా 25 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్టింది. `కార్తికేయ‌-2` తో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గీతా ఆర్స్ట్ ఈ కాంబినేష‌న్ లో సినిమా నిర్మించ‌డానికి ముందుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారా? రీజ‌నల్ మార్కెట్ తోనే స‌రిపెడ‌తారా? అన్న‌ది భ‌విష్య‌త్ లో తెలుస్తుంది.