Begin typing your search above and press return to search.

కార్తికేయ-3.. కొత్త అడ్వెంచర్ కు అంతా రెడీ

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. కార్తికేయ-2 మూవీతో ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 March 2024 12:34 PM GMT
కార్తికేయ-3.. కొత్త అడ్వెంచర్ కు అంతా రెడీ
X

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. కార్తికేయ-2 మూవీతో ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. 2014లో వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కి అద్భుత విజయం సాధించింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ కు మైథాలజీ కాన్సెప్ట్ జత చేసి రూపొందించిన ఈ మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు నిఖిల్.

అయితే కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దీనికి కూడా సీక్వెల్ కార్తికేయ-3 ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. కానీ ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో ఇంతవరకు చెప్పలేదు. దీని కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవల తండ్రిగా ప్రమోషన్ కొట్టిన నిఖిల్.. తాజాగా కార్తికేయ-3 గురించి అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే కార్తికేయ-3 రానుందని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

‘‘డాక్టర్ కార్తికేయ.. సరికొత్త అడ్వెంచర్‌ ను సెర్చ్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే రానున్నాం’’ అంటూ నిఖిల్ రాసుకొచ్చారు. దాంతోపాటు రెండు ఫోటోలను కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మరో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చూసేందుకు తాము రెడీగా ఉన్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలని ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం కార్తికేయ-3 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా తెరకెక్కనున్న మూడో సినిమా ఇది. అయితే కార్తికేయ-2 సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కృష్ణతత్వాన్ని ఉద్దేశించి చెప్పే డైలాగ్స్‌ ఇప్పటికీ మర్చిపోలేం. సినిమాకు మెయిన్ హైలైట్ అవే.

ఇక ప్రస్తుతం చందూ మొండేటి.. తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. మరోవైపు, నిఖిల్ కూడా స్వయంభు, ది ఇండియా హౌస్ వంటి భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. మరి కార్తికేయ-3 షూటింగ్ ను ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.