Begin typing your search above and press return to search.

నిఖిల్-తేజ కాంబినేష‌న్ లో పాన్ ఇండియా!

ఇది పూర్తయిన వెంట‌నే `జై హ‌నుమాన్` షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కె క్కిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   19 Jun 2025 4:52 PM IST
నిఖిల్-తేజ కాంబినేష‌న్ లో పాన్ ఇండియా!
X

యంగ్ హీరోలు నిఖిల్-తేజ స‌జ్జా ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌బోతున్నారా? ఇద్ద‌రు భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. ఆ ఈద్వ‌యాన్ని క‌లుపుతుంది క‌న్న‌డ సంచ‌ల నం రిష‌బ్ శెట్టి అని తెలిసింది. `కాంతార‌`తో రిష‌బ్ శెట్టి పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలి సిందే. ప్ర‌స్తుతం అత‌డు `కాంతార` ప్రీక్వెల్ తెరకెక్కించే ప‌నుల్లో ఉన్నాడు. తాను స్వీయా ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కి స్తున్నాడు.

ఇది పూర్తయిన వెంట‌నే `జై హ‌నుమాన్` షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కె క్కిస్తున్నాడు. అటుపై బాలీవుడ్ లో `దిప్రైడ్ ఆఫ్ భార‌త్` చిత్రాన్ని రిష‌బ్ శెట్టాలెక్కించ‌నున్నాడు. ఇప్ప టికే ఆ ప్రాజెక్ట్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ పూర్త‌యిన త‌ర్వాత 2028 లో నికిల్-తేజ‌ల‌తో రిష‌బ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

యంగ్ హీరో లిద్ద‌రు ఓ యూనిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందిట‌. ఈ చిత్రాన్ని నిర్మించేది కూడా క‌న్న‌డ నిర్మాణ సంస్థ‌నేట‌. రిష‌బ్ శెట్టే ఆ నిర్మాణ సంస్థ‌ను కూడా సెట్ చేసాడుట‌. తెలుగు, క‌న్న‌డ‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించి పాన్ ఇండియాలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు మ‌రో రెండు..మూడు నెల‌ల్లో బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది.

మొత్తానికి రిష‌బ్ శెట్టి కొత్త ప్లాన్ గ‌ట్టిగానే క‌నిపిస్తుంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయాల‌ని స్టార్లే ఎదురు చూస్తున్నారు. రాకింగ్ స్టార్ కూడా ఓ సంద‌ర్భంలో త‌న‌తో ప‌నిచేయాల‌ని ఉంద‌న్న ఆస‌క్తి వ్య‌క్తం చేసాడు. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌న క‌న్న‌డితో ప‌నిచేయాల‌ని ఉంద‌న్నారు. కానీ అంత కంటే ముందే? ఇద్ద‌రు యంగ్ స్టార్స్ ని తీసుకుంటున్నాడు.