నిఖిల్ మా వాడు అని గర్వంగా చెప్పుకుంటారు
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కు కార్తికేయ2 సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ వచ్చింది
By: Sravani Lakshmi Srungarapu | 11 Feb 2026 6:07 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కు కార్తికేయ2 సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతకుముందు వరకు టాలీవుడ్‌కే పరిచయమైన నిఖిల్, కార్తికేయ2 తర్వాత దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయమయ్యారు. కార్తికేయ2 తర్వాత నిఖిల్ ఒకట్రెండు సినిమాలు చేశారు కానీ అవి ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి.
అలాంటి నిఖిల్ నుంచి రెండేళ్లుగా ఏ సినిమా రాలేదు. అయితే తాను రెండేళ్లుగా అందరికీ దూరంగా ఉండటానికి కారణాన్ని నిఖిల్ తాజాగా వెల్లడించారు. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామా తెరకెక్కుతుండగా, సంయుక్త మీనన్, నభా నటేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అందరూ అండగా నిలిచారు
రీసెంట్ గా స్వయంభు టీజర్ లాంచ్ జరగ్గా, ఆ టీజర్లో నిఖిల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. కార్తికేయ2 లాంటి భారీ విజయానంతరం మరింత గొప్ప సినిమా చేయాలనే పట్టుదలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ప్రేక్షకుల అంచనాలను మించి ఉండే కథ, క్యారెక్టర్ కోసం టైమ్ కేటాయించాల్సి వచ్చిందని, ఈ రెండేళ్లలో తాను కనిపించకపోయినా, ఫ్యాన్స్, పరిశ్రమ వర్గాలు తనకు అండగా నిలిచాయని ఆయన ఎమోషనల్ అయ్యారు.
1000 ఏళ్ల కిందట రాయలసీమ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే యోధుడి గాథను ఆధారంగా చేసుకుని ఈ కథ రూపొందిందని నిఖిల్ తెలిపారు. చరిత్రలో పేరుకే పరిమితమైన యోధుల త్యాగాలను బిగ్ స్క్రీన్ పై ప్రతిష్టాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో స్వయంభు మూవీని రూపొందిస్తున్నామన్నారు. అల్లరిగా తిరిగే యువకుడు ఎలా యోధుడిగా మారి, రాజ్యాలను శాసించే స్థాయికి ఎదిగాడనే ప్రయాణమే స్వయంభు మూవీ అని నిఖిల్ తెలిపారు.
మన స్వేచ్ఛ వెనుక చాలా త్యాగాలు
టీజర్ లో కనిపించిన విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దేశంలోని మనమంతా స్వేచ్ఛగా జీవించడం వెనుక ఎంతోమంది చేసిన త్యాగాలున్నాయని, కానీ అందరూ పెద్ద పెద్ద రాజులు, వారి సామ్రాజ్యాల గురించే చెప్పేవారని, కానీ ఇలాంటి యోధుల గురించి ఎవరూ మాట్లాడరని, పైకి చెప్పరని నిఖిల్ అన్నారు.
కార్తికేయ2 లాంటి భారీ హిట్ తర్వాత ఎలాంటి హీరోకైనా దానికంటే మంచి సినిమా చేయాలని ఒత్తిడి సహజమని, అదే తనను మరింత కృషి చేయించిందని అఖిల్ చెప్పారు. కాగా ఈ మూవీ కోసం నిఖిల్ చాలా స్పెషల్ కేర్ తీసుకోవడంతో పాటూ రెండేళ్లుగా శారీరకంగా, మానసికంగా కృషి చేస్తూ, దాని కోసం స్పెషల్ ట్రైనింగ్స్ కూడా తీసుకున్నట్టు చెప్పారు. స్వయంభు మూవీ చూసిన తర్వాత నిఖిల్ మా వాడు అని గర్వంగా చెప్పుకుంటారని నిఖిల్ చెప్పడంతో తాను సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమవుతుంది.
