Begin typing your search above and press return to search.

నిఖిల్ సినిమాలు సౌండ్ లేదేంటి..?

స్వయంభు సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లి రెండేళ్లు అవుతుంది. ఆ సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 8:30 AM IST
నిఖిల్ సినిమాలు సౌండ్ లేదేంటి..?
X

కార్తికేయ 2 తో పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఆ తర్వాత రెండు భారీ సినిమాలు అనౌన్స్ చేశాడు. ఐతే కార్తికేయ 2 తర్వాత 18 పేజెస్ సినిమా రాగా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక నెక్స్ట్ స్పై సినిమా ఎలా వచ్చిందో అలా వెళ్లింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా కూడా నిరాశపరిచింది. నిఖిల్ ప్రస్తుతం పీరియాడికల్ మూవీగా స్వయంభుతో పాటు ది ఇండియా హౌస్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు భారీ హైప్ తో రానున్నాయి.

ముఖ్యంగా ది ఇండియా హౌస్ సినిమా రాం చరణ్ ఒక నిర్మాతగా వ్యవహరించడం వల్ల సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ది ఇండియా హౌస్ సినిమాను రాం వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వదిలారు కానీ ఆ తర్వాత సినిమా ఏమైంది అన్నది తెలియలేదు. మరోపక్క నిఖిల్ స్వయంభు అప్డేట్స్ కూడా బయటకు రావట్లేదు. స్వయంభు సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

స్వయంభు సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లి రెండేళ్లు అవుతుంది. ఆ సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది. అసలు సినిమా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు అన్న విషయాలు బయటకు రాలేదు. నిఖిల్ మాత్రం లేట్ అయినా కూడా లేటెస్ట్ గా వస్తా అంటున్నాడు. నిఖిల్ సినిమా ప్లానింగ్ బాగున్నా ఆ సినిమాల షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది అన్న క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. అంతేకాదు ఈమధ్య సినిమాలు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తేనే కానీ జనాల దృష్టిలో పడట్లేదు. మరి సైలెంట్ గా సినిమా తీసుకు వెళ్లి రిలీజ్ ముందు హడావిడి చేయకుండా ముందు నుంచే ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తే బాగుంటుంది.

నిఖిల్ తన సినిమాల గురించి ఏం అనుకుంటున్నాడో తెలియదు కానీ స్టోరీ, డైరెక్టర్ ఎంపిక ఎలా అయితే తన టాలెంట్ తో చేస్తున్నాడో సినిమా తీసే టైం లో ప్రమోషన్స్ ఇంకా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమా అప్డేట్స్ తీసుకొస్తే బాగుంటుంది. స్వయంభు, ది ఇండియా హౌస్ రెండు సినిమాలు సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఎప్పుడు రిలీజై ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాయన్నది చూడాలి.