Begin typing your search above and press return to search.

రారా ధీవర.. ‘స్వయంభూ’ సాంగ్ అదిరింది

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు రొటీన్ సినిమాలు వర్కవుట్ అవ్వడం లేదు. అందుకే హీరోలు పీరియడ్ డ్రామాలు, చారిత్రక నేపథ్యం ఉన్న కథలపై ఫోకస్ పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   2 May 2026 12:40 PM IST
రారా ధీవర.. ‘స్వయంభూ’ సాంగ్ అదిరింది
X

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు రొటీన్ సినిమాలు వర్కవుట్ అవ్వడం లేదు. అందుకే హీరోలు పీరియడ్ డ్రామాలు, చారిత్రక నేపథ్యం ఉన్న కథలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్వయంభూ’ మీద అందరి కళ్లు పడ్డాయి. ఈ సినిమా నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తే అది నెట్టింట ట్రెండ్ అవుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ను గట్టిగానే ఆకట్టుకుంటోంది.

నిజానికి నిఖిల్ గత సినిమాలతో పోలిస్తే ఈ మూవీ కోసం చేసిన మేకోవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కండలు తిరిగిన దేహం, రగ్డ్ లుక్ లో నిఖిల్ ఒక యోధుడిలా కనిపిస్తున్నారు. ‘రారా ధీవర’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు స్పాటిఫై వంటి ప్లాట్‌ఫామ్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 1 లక్షకు పైగా స్ట్రీమ్స్ సాధించి, ఈ సమ్మర్ లో రాబోయే సినిమాపై గట్టి నమ్మకాన్ని కలిగిస్తోంది. రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

సంతోష్ వెంకీ గొంతులో ఈ పాట వింటుంటే తెలియని ఎనర్జీ వస్తోంది. రామజోగయ్య శాస్త్రి తన కలం నుంచి వచ్చిన ఈ పవర్‌ఫుల్ పదాలతో ఈ సాంగ్ లో ఇంటెన్సిటీని పెంచారు. ఇక విజువల్స్ విషయానికి వస్తే, విజయ్ బిన్ని మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు నిఖిల్ మేకోవర్ కు పక్కాగా సెట్ అయ్యాయి. నిఖిల్ తో పాటు సంయుక్త మీనన్, నభా నటేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ను ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సాంకేతికంగా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సాంగ్ లో విజువల్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు ఎంత ఇంటెన్సివ్ గా ఉండబోతున్నాయో ఈ పాటలోని మేకింగ్ షాట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. 2026 సమ్మర్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. నిఖిల్ కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కావడం విశేషం.

ఇక ‘రారా ధీవర’ సాంగ్ తో స్వయంభూ టీమ్ గట్టిగానే బజ్ క్రియేట్ చేసింది. చైనీస్, స్పానిష్, అరబిక్ తో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ పాట ఇస్తున్న జోష్ చూస్తుంటే, నిఖిల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమనిపిస్తోంది. మరి 2026 వేసవిలో ఈ యోధుడు వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.